Begin typing your search above and press return to search.

ఇంకా ఆ స్టేజ్‌ లోనే..కరోనాపై ఆందోళన వద్దు

By:  Tupaki Desk   |   8 April 2020 12:30 AM GMT
ఇంకా ఆ స్టేజ్‌ లోనే..కరోనాపై ఆందోళన వద్దు
X
ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కేసులు ఏకంగా 3వేలకు పైగా చేరాయి. అయితే రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతుండడంతో కరోనా వైరస్‌ మూడో దశకు చేరిందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడో దశకు చేరడంతోనే వైరస్‌ ఇంతలా వ్యాప్తి చెందుతోందని భావిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ ఏ దశలో ఉందో వెల్లడించింది.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగిందని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించడంతో అది వాస్తవమేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఏకీభవించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగిందని ఎయిమ్స్ వైద్యుడు, కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డా.రణదీప్ గులేరియా తెలిపిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ఆ వైరస్ వ్యాప్తి రెండో దశ నుంచి మూడో దశ మధ్యలో ఉందని సంచలన ప్రకటన చేశారు. అయితే అలాంటి ప్రాంతాలు కొన్నే ఉన్నాయని.. దేశం మొత్తం ఇప్పటికీ రెండో దశలోనే ఉందని వెల్లడించారు. దీని పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శ లవ్‌ అగర్వాల్‌ క్లారిటీ ఇచ్చారు.

ఏదైనా ఒక ప్రాంతంలో పరిమిత సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తే క్లస్టర్ కంటైనర్ వ్యూహం అమలుచేస్తామని అగర్వాల్‌ తెలిపారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రం ప్రభుత్వ చర్యలు ఉంటాయని, ఎక్కడైనా లోకల్ ట్రాన్స్‌మిషన్ జరిగితే తాము అందరినీ అప్రమత్తం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్టేజ్-2 స్టేజ్-3 మధ్యలో ఉందని వెల్లడించారు. ఆ వైరస్‌ స్టేజ్-3కి చేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. స్టేజ్-1లో కేవలం విదేశాల నుంచి వచ్చినవారిలో మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడతాయని, స్టేజ్-2లో విదేశాల నుంచి వచ్చిన వారిని కలిసిన వారిలో వైరస్‌ సోకుతుందని, స్టేజ్-3 అంటే స్థానికంగా ఆ వైరస్‌ తీవ్రంగా వ్యాపించడమని వివరించారు. ఈ దశలో ఎవరి నుంచి ఎవరికి వైరస్ వ్యాప్తి చెందిందనేది గుర్తించడం కష్టమని తెలిపారు.