Begin typing your search above and press return to search.
కరోనా మృతుల నుంచి వైరస్ వ్యాపించదు.. అంత్యక్రియలూ చేసుకోవచ్చు.. కానీ!
By: Tupaki Desk | 11 May 2021 12:30 AM GMTకరోనా వైరస్ అనేక విధాలుగా మనుషులపై ప్రభావం చూపిస్తోంది. వైరస్ ఎక్కడ తమకు కూడా అంటుకుం టుందోననే భయంతో.. తమ వారే కరోనాతో మృతి చెందినా.. కనీసం దగ్గరకు కూడా వెళ్లేందుకు.. కడ చూపు చూసేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు. మనసులో కుమిలిపోయినా.. తమ బాధ ఎవరికీ రావద్దని దేవుణ్ని వేడుకుంటున్నా... ఎవరూ కూడా సాహసించలేక పోతున్నారు. అంతిమ సంస్కారాలు సైతం చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఎంతో మంది కుటుంబ సభ్యులు కళ్లముందే ఉన్నా.. కట్టుకున్నవారు, కన్నవారు సైతం తిరుగాడుతున్నా.. కరోనాతో మృతి చెందిన వారు దాదాపు 90 శాతం మంది అనాథులుగానే మిగులుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.
భయం లేదు!
నిత్యం ఇలాంటి వార్తలు కూడా మీడియాలోనూ వస్తున్నాయి. కరోనా భయం నేపథ్యంలో పాడె మోయడా నికీ ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో ట్రాక్టర్ ట్రాలీ/ జేసీబీలతో శ్మశానాలకు తీసుకెళ్తున్నారు. కడసారి చూడటానికి కూడా దగ్గరికి రాకపోవడం, మృతదేహాలను నేరుగా చితిమీదికి చేర్చడమో, గుంతలో పడేయడమో చేస్తుండటం హృదయాలను ద్రవింపజేస్తోంది. అయితే.. కరోనాతో మృతి చెందిన వారి నుంచి వైరస్ వ్యాపించే అవకాశం లేదని, నిరభ్యంతరంగా ఎవరి సంప్రదాయాలను అనుసరించి వారు అంత్యక్రియలు సైతం చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే.. కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాలని సూచిస్తున్నారు. ఈ మేరకు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్(మాజీ ఎంపీ), డాక్టర్ శ్రీహర్ష, (సర్వైలెన్స్ ఆఫీసర్, హైదరాబాద్), డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి(నోడల్ ఆఫీసర్, గాంధీ కోవిడ్ సెంటర్) చెబుతున్నారు.
వైరస్ ఎందుకు వ్యాపించదంటే..
ఇప్పటివరకు కరోనా మృతుల నుంచి వైరస్ వ్యాపిస్తుందా? లేదా? అనే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. ఇటీవల రాజస్థాన్‌లో కరోనా మృతునికి అంత్యక్రియలు చేసిన 21 మంది చనిపోయారనే వార్తలు హల్‌చల్ చేయడంతో ఈ భయం మరింత పెరిగిపోయింది. అయితే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ప్రాణం పోయిన తర్వాత కరోనా మృతుని శరీరంలో వైరస్ ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పటికే బాడీలోని ప్లూయిడ్స్‌లో వైరస్ ఉన్నా.. దానికది ఇతర ప్రదేశాలకు వ్యాపించలేదు.
అయితే.. ఇలా మాత్రం చేయొద్దు!
కరోనాతో మృతి చెందిన వారి నుంచి వైరస్ బయటకు రాకపోయినా.. నేరుగా మాత్రం మృత దేహాన్ని తాకొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా మృతదేహాన్ని నేరుగా తాకడం, పైన పడి ఏడవడం, చనిపోయినవారి తల, ఇతర శరీర భాగాలను ఒళ్లో పెట్టుకుని ఏడవడం వంటివాటి వల్ల మాత్రమే వైరస్ విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనా మృతదేహాన్ని ఉంచిన జిప్‌బ్యాగ్‌ను తెరవకుండా ఉంటే వైరస్ సోకే అవకాశం లేనట్టేనని అంటున్నారు. మృతదేహాల నుంచి ఇతరులకు వైరస్ సోకిన దాఖలాలు లేవని.. అప్పటికే వైరస్ సోకి, లక్షణాలు లేనివారు గుంపుగా ఉన్న జనంలో కలిసి దహన సంస్కారాల్లో పాల్గొనడం వల్లే వైరస్ విస్తరిస్తోందని చెప్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పదు!
+ సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్‌తో మృతదేహాన్ని శుభ్రం చేయాలి.
+ జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టి జాగ్రత్తగా తరలించాలి. జిప్‌లాక్ బ్యాగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దు.
+ కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌవ్స్ ధరించి పాడె మోయవచ్చు.
+ చనిపోయినవారి నోట్లో పాలు పోయడం, అన్నం పెట్టడం, పగడం పెట్టడం వంటివి చేయొద్దు.
+ మృతదేహానికి మూడు నుంచి ఆరు మీటర్ల దూరంలో ఉండి నివాళి అర్పించవచ్చు.
+ చనిపోయిన తర్వాత కూడా రక్తం గడ్డకట్టకపోవడంతో ముక్కు, చెవులు, ఇతర రంధ్రాల నుంచి రక్తం బయటికి కారుతుంది. సోడియం హైపోక్లోరైడ్‌తో మృతదేహాన్ని శుభ్రపర్చినా.. తర్వాత శరీరంలోని ఫ్లూయిడ్స్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మృతదేహాన్ని నేరుగా తాకవద్దు.
+ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించవచ్చు.
+ మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లి, ఊరేగింపులు జరపకుండా.. ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు పూర్తి చేయడం మంచిది.