Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్: సోషల్ మీడియాకు వెంటనే స్పందిస్తున్న ఏపీ ప్రభుత్వం !
By: Tupaki Desk | 31 March 2020 12:33 PM GMTకరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్తగా చర్యలు ప్రారంభించాయి.. మంత్రులు, అధికారులు పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. అయితే , ఈ కరోనా పై సోషల్ మీడియా లో రకరకాలైన వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఏది నిజమో ..ఏది అబద్దమో కూడా తెలియని పరిస్థితి. దీనితో సోషల్ మీడియా అంటే ... తప్పుడు వార్తలే ప్రచారం అవుతాయని అందరూ అనుకునేవారు. కానీ , ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటికీ విశ్వసనీయత రాకపోయినా కనీసం కొన్ని విషయాల్లో మాత్రం జనాభిప్రాయానికి ప్రతీకలుగా మారుతున్న సోషల్ మీడియా పోస్టులను ప్రభుత్వాలు కూడా పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్ధితి.
ఇదే కోవలో ఏపీలోని వైసీపీ సర్కారు తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై స్పందిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అంటే ప్రభుత్వాలకి అసలు పడదు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, వ్యక్తులపై బురదజల్లేందుకు ప్రత్యర్ధులు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారని భావించే పరిస్ధితులు. కానీ ప్రస్తుతం కాలం మారుతోంది. తమకు ఇబ్బంది కలిగితే చాలు దాన్ని రెగ్యులర్ మీడియాతో ఎలా పంచుకోవాలో తెలియని పరిస్ధితులలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు.
ఏపీలో గతంలో తమపై సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే అంతెత్తున ఎగిరే వైసీపీ ప్రభుత్వం, వాటిలో ఉన్న వాస్తవాన్ని కాస్తో కూస్తో గుర్తించే పనిలో ఉంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా విధించిన లాక్ డౌన్ లో పోలీసులు కొన్ని చోట్ల అతిగా ప్రవర్తించిన ఘటనలను సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చేశారు. ప్రజలపై దాడులకు పాల్పడిన రాయచోటి, పెరవలి ఎస్సైలను ప్రభుత్వం సస్పెండ్ చేయగా.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ మద్యాన్ని అక్రమంగా తరలించిన తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సీఐని సస్పెన్షన్ తో పాటు 5 లక్షల జరిమానా కూడా విధించారు.
దీన్ని బట్టే చెప్పవచ్చు ప్రభుత్వం సోషల్ మీడియా పై ఇంత ఫోకస్ పెట్టిందో ..తాజాగా ఏపీ సర్కారు సోషల్ మీడియాలో పోస్టులను సైతం సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలకు ఉపక్రమిస్తుండటంతో విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించే అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణాన ఎవరు సెల్ ఫోన్లో తమను వీడియో తీసి వైరల్ చేస్తారో తెలియక వీరంతా ఆందోళన చెందే పరిస్ధితి నెలకొంది. దీంతో విధి నిర్వహణలో అప్రమత్తత కూడా పెరిగింది.