Begin typing your search above and press return to search.

కరోనాతో వ‌ణికిపోతున్న ఇండియా..ప్ర‌త్యేక ఫ్లైట్ల‌తో బ‌డాబాబులు..

By:  Tupaki Desk   |   9 March 2020 5:49 PM GMT
కరోనాతో వ‌ణికిపోతున్న ఇండియా..ప్ర‌త్యేక ఫ్లైట్ల‌తో బ‌డాబాబులు..
X
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ప్ర‌భావితం కాని రంగం అంటూ ఏదీలేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని ముఖ్య‌మైన దేశాలు - వాటి ఆర్థిక వ్యవ‌స్థ‌లు - వ్యాపార‌వేత్త‌లు - ఎకాన‌మీ ఇలా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బ‌తింటున్న ప‌రిస్థితి. దీనికి భార‌త‌దేశం ఏ మాత్రం అతీతం కాదు. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, మన మార్కెట్లు హడలెత్తాయి. టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేయడం ప్రారంభించాయి. ట్రావెలర్స్‌‌ పై ఆంక్షలు కూడా స్టార్ట్ అయ్యాయి. డొమెస్టిక్ - ఇంటర్నేషనల్ ట్రిప్స్ తగ్గిపోయాయి. ఈ ప్రభావం మన దేశానికి కీలకంగా ఉన్న ఎయిర్ ట్రావెల్ ఇండస్ట్రీకి భారీగా దెబ్బకొడుతోంది.

అయితే, ఇది ఒక వైపే. నాణానికి మ‌రోవైపు ఏంటంటే...విమాన ప్ర‌యాణాల్లో విచిత్రం. త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌యాణం చేయవ‌ల‌సిన వ్యాపార‌వేత్త‌లు - కార్పొరేట్లు - ఇత‌ర ప్ర‌ముఖులు కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ప్ర‌త్యేక ఫ్లైట్ల‌లో టూర్లు వేస్తున్నారు. సాధార‌ణ ఫ్లైట్ల‌లో అయితే కో ప్యాసింజ‌ర్ల‌తో క‌లిసి ప్ర‌యాణించాలి, వారి వ‌ల్ల క‌రోనా సోకుతుందేమో అని భ‌య‌ప‌డాల్సి ఉంటుందని ప్ర‌త్యేక ఫ్లైట్ల‌ను బుక్ చేసుకుంటున్నారు. ఏకంగా ప‌ది రెట్ల ధ‌ర పెట్టేందుకు అయినా వెనుకాడ‌టం లేదు. బిజినెస్ మ‌రియు కార్పొరేట్ రంగాల‌కు చెందిన వారు ఈ జాబితాలో ప్ర‌ధానంగా ఉన్నారని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలాఉండ‌గా, దేశంలో కరోనా కేసులు వెలుగులోకి రావడంతో కార్పొరేట్ కంపెనీలు కూడా ఉద్యోగులను బయటి దేశాలకు పంపడం లేదు. వీడియో కాన్ఫరెన్స్‌‌ ల ద్వారానే మీటింగ్స్ నిర్వహిస్తున్నాయి. దేశంలోకి వ‌చ్చే - దేశం నుంచి వెళ్లే ఎయిర్ ట్రావెలర్ల టిక్కెట్లు ర‌ద్దు చేసుకోవ‌డం పెరిగింది. ఈ క్యాన్సిలేషన్ వల్ల రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు దెబ్బతినే అవకాశం కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతోందని, డొమెస్టిక్ ట్రావెల్‌‌ బాగా ప్రభావితమవుతున్నట్టు ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు.