Begin typing your search above and press return to search.
తస్మాత్ జాగ్రత్త.. ఏడు నెలల పాటు కరోనా వైరస్...?
By: Tupaki Desk | 28 Dec 2021 5:32 AM GMTకరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆరోగ్య విపత్తును తీసుకొచ్చింది. అప్పటిదాకా సవ్యంగా జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కంటికి కనిపించని ఈ వైరస్ ఒక్కసారిగా కుదిపేసింది. ఇక నాటి నుంచి నేటి వరకు అనగా దాదాపు రెండేళ్ల కాలం నుంచి వణికిస్తూ ఉంది. కరోనా ధాటికి అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలన్నీ కూడా విలవిల్లాడుతున్నాయి. ఇంతలా విలయతాండవం చేస్తున్న వైరస్ పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే సంస్థ ఆసక్తికరమైన అంశాలు వెల్లడించింది.
అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనంలో కోవిడ్ గురించి కీలక అంశాలు వెల్లడయ్యాయి. కేవలం 14 రోజుల తర్వాత కరోనా నుంచి బయటపడగలమని ఇప్పటిదాకా వైద్య నిపుణులు చెప్పారు. అయితే వైరస్ నుంచి విముక్తి పొందిన తర్వాత కూడా దాదాపు ఏడు నెలలకు పైగా కాలం పాటు కరోనా మన శరీరంలోనే ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతేకాకుండా మానవ శరీరంలో ముఖ్య భాగాలపై ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు. గుండె, ఊపిరితిత్తులు మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణశయాంతర కణజాలాలు.మూత్రపిండాల, పునరుత్పత్తి కణజాలం, కండరాలు, కొవ్వు వంటి భాగాలు దాదాపు 230 రోజుల పాటు వైరస్ ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు.
శరీరంలో ఏడు నెలల పాటు ఉంటూ... అవయవాలపై దాడి చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ వైరస్ లోడు అధికంగా ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ నాళం లో ఉందని తేల్చారు. కానీ ఊపిరితిత్తులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకలేదని వారి పరిశోధన పత్రాల్లో వెల్లడించారు. ఇకపోతే వైరస్ లక్షణాలు అతి తక్కువగా ఉన్నవారు, అసలు లక్షణాలే లేనివారిలో సైతం వైరస్ ఏడు నెలల పాటు ఉంటుందని వెల్లడించారు. కరోనాతో మృతి చెందిన 44 మంది మృతదేహాలపై పలు ప్రయోగాలు చేసి... ఈ విషయాలు గుర్తించినట్లు వెల్లడించారు.
కరోనా వైరస్ వేరియంట్లు రూపంలో విరుచుకుపడుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. అమెరికా, యూకే వంటి దేశాల్లో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డెల్టా కంటే అతి తక్కువ ప్రమాదకరమైన ఈ కొత్త వేరియంట్... అతి త్వరగా వ్యాపించే లక్షణాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే భారతదేశంలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లో మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తం మవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కాగా పండుగ వేళ జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారులు, ప్రభుత్వం సూచిస్తోంది.