Begin typing your search above and press return to search.
న్యూయార్క్ లో కరోనా తో ప్రకాశం జిల్లా వాసి మృతి !
By: Tupaki Desk | 8 April 2020 5:45 AM GMTఅగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో కరోనా విలయతాండవం చేస్తుంది. దేశం మొత్తం మీద చోటు చేసుకున్న కేసుల్లో మూడో వంతు కేసులు ఇక్కడే వెలుగు చూశాయి. ప్రపంచంలోనే అత్యంత జన సాంద్రత గల నగరాల్లో ఒకటిగా ఉండటంతో న్యూయార్క్ లో కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుంది. ఇక తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలోని ఏదుబాడు గ్రామానికి చెందిన కంచి బోట్ల బ్రహ్మానందం అమెరికా లో కరోనా వైరస్ తో మృతిచెందారు. ఈయన అమెరికాలోని న్యూయార్క్ సిటీలో బిబిసిలో న్యూస్ రీడర్ గా పని చేస్తున్నారు. పది రోజుల క్రితం కరోనా భారిన పడిన అయన ..కరోనాతో పోరాడి చివరికి కరోనా కారణంగా ప్రాణాలని వదిలారు. ఈయనకి భార్య , కూతురు , కుమార్తె ఉన్నారు. బ్రహ్మానందం మరణవార్త వినడంతో ... ఏదుబాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇకపోతే ,ఈ కరోనా దెబ్బకి అమెరికాలోని ప్రధాన నగరాలన్నీ శ్మశానాలుగా దర్శనం ఇస్తున్నాయి. కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని చవి చూస్తున్నాయి. అమెరికాలో ఒక్కరోజే 1858 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. కరోనా మరణాల సంఖ్యలో అమెరికా తన రికార్డును తానే బ్రేక్ చేసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే అమెరికాలో ఒక్కరోజులో వెయ్యి మందికి పైగా మరణించిన సందర్భాలు రెండుసార్లు సంభవించాయి. ఈ రెండు రికార్డులను అధిగమించేలా.. 1858 మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో మరణాలు నమోదు కాలేదు.
కరోనా వైరస్ బారిన పడి అమెరికా ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్ సిటీ మొత్తం అల్లకల్లోలం అయ్యింది. ఒక్క న్యూయార్క్ లోనే 5489 మంది మరణించారు. ఇప్పటివరకు ఒక్క న్యూయార్క్ లో 1,42, 384 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కరోనా మరణాల సంఖ్య 10 మార్క్‌ను దాటవచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి న్యూ యార్క్ సిటీనే కాదు ..అమెరికాలోని దాదాపు అన్ని నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. న్యూజెర్సీ లో 1232 మంది మరణించారు. మిచిగాన్, కాలిఫోర్నియా, లూసియానా, మస్సాచుసెట్స్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఇల్లినాయిస్, జార్జియాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నగరాలలో కరోనా దెబ్బకి రోజూ వందలాది మంది పిట్టల్లా రాలి పోతున్నారు. అలాగే అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలను దాటింది. అయితే కరోనా నుండి కోలుకునే వారు ఆ స్థాయిలో లేక పోవడంతో ఆందోళన కలిగిస్తోందని వైట్‌హౌస్ ప్రతినిధులు చెబుతున్నారు.