Begin typing your search above and press return to search.
న్యూయార్క్ లో 10 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య!!
By: Tupaki Desk | 14 April 2020 6:10 AM GMTచైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి పైగా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా అమెరికాలో ఈ మహమ్మారి చాల వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 587,155 మంది కరోనా భారిన పడగా ..23,644మంది మృతి చెందారు. ముఖ్యంగా ఆధునికతకు కేరాఫ్ అడ్రస్ అయిన న్యూయార్క్.. ఈ వైరస్ బారిన పడి దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొంటోంది. అమెరికాలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒక్క న్యూయార్క్ పై కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.
న్యూయార్క్ లో కరోనా వైరస్ మరణాలు 10 వేల మార్క్ ను అధిగమించాయి. 10,056 మంది కరోనా వైరస్ వల్ల మరణించినట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో తెలిపారు. ఆదివారం ఒక్కరోజే 671 మంది మరణించినట్లు చెప్పారు. కరోనా వైరస్ వల్ల సంక్షోభం తలెత్తిందని, దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇంతకు మించి మరొకటి ఉండక పోవచ్చని చెప్పారు. కాగా, కేవలం న్యూయార్క్ లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువగా ఉంటోంది. ప్రస్తుతం అక్కడ 1,95,655 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 1,68,510 యాక్టివ్ కేసులు ఉంటున్నాయి. వారిలో పలువురి ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా ఉంటోందని, ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపో లేదని అంటున్నారు.
అమెరికాలో మొత్తం 23, 644 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించగా.. అందులో ఎక్కువ మంది న్యూయార్క్ వాసులే కావడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికాకు ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన ఈ నగరం.. చివరికి కరోనా వైరస్ మరణాల్లో కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, మిచిగాన్ మినహా మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో మరణాలు నమోదు కాలేదు. అన్నీ వెయ్యికిలోపే ఉంటున్నాయి. న్యూజెర్సీ, మసాచ్చుసెట్స్, మిచిగాన్, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, ఫ్లోరిడా, లూసియానా వంటి నగరాల్లో 20 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.