Begin typing your search above and press return to search.

అమెరికాలో కరోనా మరణమృదంగం...!

By:  Tupaki Desk   |   15 April 2020 10:10 AM GMT
అమెరికాలో కరోనా మరణమృదంగం...!
X
అమెరికాలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే ఇప్పుడు కరోనాతో అల్లకల్లోలమవుతోన్న దేశం అమెరికానే. మొన్నటిదాకా ఇటలీ - స్పెయిన్ వైరస్‌ ధాటికి అతలాకుతలం కాగా ఇప్పుడు అమెరికా ఆ స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అమెరికా.. అలాంటి అగ్రరాజ్యం కరోనా వైరస్ మహమ్మారి దాటికి అల్లాడిపోతున్నాయి.

కాగా , అమెరికాలో నిన్న ఒక్క రోజే అమెరికాలో 2,407 మంది కరోనా వల్ల మృత్యు వాతపడ్డారు. అమెరికాలో ఒక రోజులో కరోనా వల్ల మరణించిన వారిలో ఇదే అత్యథికం. అమెరికాలో 24 గంటల వ్యవధిలో రెండు వేలకు పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు కావడం ఇది రెండోసారి. నిన్న ఒక్క రోజే అమెరికాలో 26,945 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 614,246కు చేరింది. అలాగే అమెరికాలో ఇప్పటివరకు 26,064 మంది కరోనా భారిన పడి మృతిచెందారు. అమెరికాలో అత్యథికంగా న్యూయార్క్ లోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉంది.

కాగా, నిన్నటికి ఒక్క న్యూయార్క్ సిటీ లోనే కరోనా వ్యాధి కారణంగా 11వేల మంది చనిపోయారు. మరోవైపు అమెరికాలో పడకలకు - పీపీఈలకు - వెంటిలేటర్లకు కొరత లేదని అధికారులు ప్రకటించారు. ప్రతి రోగికి బెడ్ అందుబాటులో ఉందని - క్రిటికల్ పేషెంట్ల కోసం 16వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. మరోవైపు అనుమానితులు తమకుతాముగా కరోనా పరీక్షను చేసుకునేలా పరికరాన్ని రూపొందించింది అమెరికా. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 లక్షలని దాటేసింది. ఇప్పటివరకు నాటికి వరల్డ్ వైడ్ 126,839 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. అటు ఇటలీలో 21,067 మంది, స్పెయిన్ లో 18,255 మంది, ఫ్రాన్స్ లో 15,729 మంది ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించారు.