Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. అమెరికన్లకు కొత్త భయం పట్టుకుందట!

By:  Tupaki Desk   |   16 April 2020 4:45 AM GMT
కరోనా వేళ.. అమెరికన్లకు కొత్త భయం పట్టుకుందట!
X
కరోనాకు పుట్టినిల్లు అయిన వూహాన్ కు మిన్నగా అమెరికాలో పిశాచి వైరస్ ఎంతలా చెలరేగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి పెద్దన్న అయిన ఆగ్రరాజ్యం.. కంటికి కనిపించని వైరస్ ను నిలువరించటంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. ఇందుకు తగ్గట్లే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. ప్రపంచంలోని మరే దేశంలోనూ నమోదు కానన్ని పాజిటివ్ కేసులతో పాటు.. మరణాల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఒకరోజులో చోటు చేసుకున్న మరణాలుకూడా అగ్రరాజ్యంలోనే ఎక్కువని చెబుతున్నారు.

ప్రాణాలు తీసే కరోనా భయాందోళనల వేళ.. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని రీతిలో అమెరికన్లు కొత్త అలవాటును ప్రదర్శిస్తున్నారట. కరోనా భయంతో భవిష్యత్తులో తమకు పిల్లలు పుట్టరేమోనన్న భయంతో తమ స్పెర్మ్ (వీర్యం)ను బ్యాంకుల్లో దాచేసుకునే ధోరణి పెరుగుతోంది. దీంతో.. అమెరికాలో స్పెర్మ్ కిట్ల అమ్మకాలు బాగా పెరిగాయి. ఎందుకిలా అంటే? కరోనా కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందన్న భయం అమెరికన్లకు పట్టుకుంది.

వాస్తవానికి సెక్సు ద్వారా కరోనా వ్యాపించదని కూడా ఒక అధ్యయనం తేల్చింది. కరోనాతో సెక్సు సామర్థ్యం కానీ.. స్పెర్మ్ కౌంట్ తగ్గటం లాంటివి ఇప్పటివరకూ నిరూపితం కాలేదు. అయినప్పటికీ.. తమ కౌంట్ తగ్గుతుందేమోనన్న భయంతో స్పెర్మ్ బ్యాంకుల్ని సంప్రదిస్తూ.. తమ స్పెర్మ్ ను దాచేస్తున్న ట్రెండ్ అగ్రరాజ్యంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లు చెబుతున్నారు.