Begin typing your search above and press return to search.

ఓ మహిళ ప్రాణం తీసిన ట్రంప్ సూచించిన డ్రగ్

By:  Tupaki Desk   |   18 April 2020 11:30 AM GMT
ఓ మహిళ ప్రాణం తీసిన ట్రంప్ సూచించిన డ్రగ్
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజుల క్రితం కరోనాపై ‘హైడ్రాక్సి క్లోర్లోక్విన్’ ఉపయోగించాలని.. దీని ద్వారా కరోనా తగ్గుతుందని సూచించారు. అంతేకాదు.. భారత్ తో ఫైట్ చేసి పెద్ద ఎత్తున దేశంలోకి దిగుమతి చేసుకున్నారు. దీనిని ‘మ్యాజిక్ డ్రగ్’ అని కూడా ట్రంప్ పిలుపునిచ్చారు.

అయితే ట్రంప్ ప్రకటనతో కరోనా లక్షణాలతో ఉన్న న్యూయార్క్ మహిళ ‘హైడ్రాక్సి క్లోర్లోక్విన్ - అజ్రితిమైసిన్’ మందులు వాడి మరణించడం విషాదం నింపింది.

హైడ్రాక్సి క్లోర్లోక్విన్ సాధారణంగా మలేరియా నివారణ లూపస్ (చర్మ ఇన్ ఫెక్షన్లు) చికిత్సకు ఉపయోగిస్తారు. అజిత్రోమైసిన్ యాంటీ బయోటిక్ గా వాడుతారు.

ప్రపంచంలోనే హైడ్రాక్సి క్లోర్లోక్విన్ అతిపెద్ద ఉత్పత్తి దారుల్లో భారతదేశం ఒకటి. ప్రతీ సంవత్సరం 50 మిలియన్ డాలర్ల విలువగల మందులను ఎగుమతి చేస్తుంటుంది. మొదట్లో కరోనా కారణంగా భారత్ లో దీని ఎగుమతి నిషేధించినప్పటికీ ట్రంప్ ఒత్తిడితో దాన్ని ఇప్పుడు సడలించారు. అమెరికాతోపాటు 50దేశాలకు ఇప్పుడు ఈ మందును భారత్ ఎగుమతి చేస్తోంది.

తాజాగా ఈ హైడ్రాక్సిక్లోర్లోక్విన్ అధిక వినియోగం డేంజర్ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మంగళవారం హెచ్చరించింది. డాక్లర్ల పర్యవేక్షణ లేకుండా తీసుకోవద్దని స్పష్టం చేశారు. అత్యవసరంగా మాత్రమే వాడాలని సూచించారు. అయితే అమెరికాలో ట్రంప్ పిలుపుతో కరోనాకు ఇదే మందు అని ఒక న్యూయార్క్ మహిళ వాడి ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకోవడం విషాధం నింపింది.