Begin typing your search above and press return to search.
కరోనా: అమెరికాకు గొప్ప ఊరట.. ఏం జరిగిందంటే?
By: Tupaki Desk | 21 April 2020 5:50 AM GMTఅమెరికాకు గొప్ప ఉపశమనం.. ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. దేశంలోనే కరోనాకు కేంద్రంగా ప్రధాన హాట్ స్పాట్ గా మారిన న్యూయార్క్ లో కరోనా కేసుల సంఖ్యతోపాటు మరణాలు తగ్గడం ఊరటనిచ్చింది. గత మూడు వారాల్లో తొలిసారిగా న్యూయార్క్ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య ఒకే రోజులో 500 కన్నా తక్కువకు పడిపోయింది. నిన్న సోమవారం మరణాలు 478 మాత్రమే నమోదు కావడం గమనార్హం.
ఇక న్యూయార్క్ రాష్ట్రంలో కొత్తగా ఈ వారంలో ఆస్పత్రిలో కరోనా వైరస్ కారణంగా చేరే వారి సంఖ్య పడిపోవడం విశేషం. ఏప్రిల్ 19 శనివారం నమోదైన మరణాలు 540 కాగా.. ఆదివారం 507, సోమవారం 478కి పడిపోయాయి.
న్యూయార్క్ రాష్ట్రంలో రోజువారీ మరణాలు ఇప్పటివరకు 606-799 మధ్య నమోదయ్యాయి. ఏప్రిల్ 9న అత్యధిక మరణాలు సంభవించాయి. ఇక కొత్త కరోనా వైరస్ కేసులు అమెరికా వ్యాప్తంగా ఆదివారం 6054కు పడిపోగా.. శనివారం 7090 కేసులు నమోదయ్యాయి.
న్యూయార్క్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 248431. 18300మందికి పైగా మరణించారు. ఇక న్యూయార్క్ లో కరోనా వైరస్ కోసం పరీక్షలు తగ్గాయి. ఎమర్జెన్సీ కాల్స్ కూడా తగ్గడం విశేషం.
ఇక న్యూయార్క్ కే కాదు.. ఇతర కరోనా తీవ్రత అధికంగా ఉన్న న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లోన కరోనాతో మరణాల సంఖ్య గత మూడు రోజులుగా పడిపోవడం విశేషం.
దీంతో అమెరికా కరోనా నుంచి మెల్లిగా బయటపడుతుందనే విశ్వాసం అధికారుల్లో నెలకొంది. ఇలానే సాగితే కరోనాను జయించగమని భావిస్తున్నారు.