Begin typing your search above and press return to search.

కరోనా: ట్రంప్ కు ప్రాణాల కన్నా ఎన్నికలే ముఖ్యమట!

By:  Tupaki Desk   |   28 April 2020 2:00 PM IST
కరోనా: ట్రంప్ కు ప్రాణాల కన్నా ఎన్నికలే ముఖ్యమట!
X
అగ్రరాజ్యపు అధినేతకు మనుషుల ప్రాణాల కన్నా ఎన్నికలు.. అధికారమే ముఖ్యమని మీడియా సాక్షిగా బయటపడింది. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.అయితే దేశంలో కరోనా వైరస్ తో అల్లకల్లోలంగా మారిన పరిస్థితులు.. మరణాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఈసారి అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తరుఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ‘జో బిడన్’ తాజాగా ట్రంప్ ను కోరారు.

అయితే ఇదే విషయంపై తాజాగా వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రశ్న ఎదురైంది. కరోనా విజృంభణ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు ఏమైనా ఉంటాయా అని విలేకరులు ప్రశ్నించారు. దానికి ట్రంప్ దిమ్మదిరిగే సమాధానమిచ్చారు.

కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడాలని నేను అనుకోవడం లేదు అని ట్రంప్ అన్నారు. అధక్ష్య ఎన్నికల తేదీల్లో మార్పులుండవు. అలా ఎందుకు చేయాలి? నవంబర్ 3న మంచి తేదీ. ఆ రోజే అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ లోనే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఇలా అమెరికా లో ఎన్నడూ లేనంత విపత్తు వచ్చినా.. కరోనాతో ప్రాణాలు పోతున్నా.. దానిని కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నా కూడా ట్రంప్ ఎన్నికలు.. రాజకీయం గురించే ఆలోచించడం విమర్శలకు తావిస్తోంది. జనాల బాధ పట్టని అధ్యక్షుడి అధికారం దాహానికి ఇది నిదర్శనం అని ప్రతిపక్షం డెమొక్రటిక్ పార్టీ ఆరోపించింది.