Begin typing your search above and press return to search.
అనంతపురంలో ఒక్కరోజే 16 కరోనా కేసులు..100 కి ఒకటే తక్కువ!
By: Tupaki Desk | 8 May 2020 9:30 AM GMTఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం ఏ మాత్ర తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా ప్రతి రోజు హాఫ్ సెంచరీకి తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, గత 24 గంటల్లో కొత్తగా 54 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 1887కు చేరింది. అటు.. కొత్తగా ముగ్గురు కరోనా సోకి మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 41కి చేరింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 1004 మంది చికిత్స పొందుతుండగా, 842 మంది డిశ్చార్జి అయ్యారు.
ఈ రోజు కొత్తగా నమోదైన 54 కేసుల్లో ..ఒక్క అనంతపురం జిల్లాలోనే ఈ రోజు 16 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.దీనితో మొత్తం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99 కి చేరింది. ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుండి అనంతపురంలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కాలేదు. ఒకే రోజు ఎక్కువ కేసులు ఇప్పటివరకు కర్నూలు - గుంటూరు జిల్లాలోనే నమోదు అవుతూ వచ్చాయి. అయితే జిల్లాలో ఒకే రోజు ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడానికి గల కారణాన్ని చూస్తే ..కేంద్రం లాక్ డౌన్ నుండి ఇచ్చిన సడలింపులే అని కూడా చెప్పవచ్చు. లాక్ డౌన్ కారణంగా మొన్నటివరకు ఎక్కడివారు అక్కడే ఉన్నారు. కానీ , తాజాగా ఎవరి ఇంటికి వారు వెళ్ళడానికి ప్రభత్వం అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా ఎంతోమంది రోడ్ల పైకి వచ్చారు.
ముఖ్యంగా అనంతపురం జిల్లా వాసులు ..తమ జిల్లాలో ఉండే పరిస్థితుల దృష్ట్యా ఎక్కువగా పనుల కోసం ఇతర రాష్ట్రాలకి వెళ్తుంటారు. ముఖ్యంగా అనంతపురం కర్ణాటక ..ఏపీకి బార్డర్. చాలామంది అనేక అవసరాల కోసం కర్ణాటకకి కూడా వెళ్తుంటారు. ఇలా ఒక దగ్గరి నుండి ఇంకో దగ్గరికి రావడం వల్ల ..అప్పటివరకు కరోనా వ్యాధి లేని వారు కూడా మార్గ మధ్యలో ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఒకే రోజు 16 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే , జిల్లా వైద్య యంత్రాగం మాత్రం ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని - ఈ విపత్తుని ఎదుర్కోవడానికి ప్రభుత్వం - జిల్లా యంత్రాగం సిద్ధంగా ఉందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. కాగా, గత రెండు రోజుల క్రితం వరకు కూడా గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరం లో కూడా కరోనా కేసులు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ రోజు మరో కేసు నమోదు కాగా ..మొత్తంగా జిల్లాలో 4 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.