Begin typing your search above and press return to search.
చావు కబురు చల్లాగా చెబుతున్న ఏపీ ఆర్టీసీ?
By: Tupaki Desk | 6 April 2020 6:15 AM GMTకరోనా దేశాన్ని ఆవహించింది. గడిచిన వారం రోజుల్లోనే 1000 కేసులు దాటాయి. మూడో స్టేజీలోకి వచ్చి వేగంగా వ్యాపిస్తోంది. రోజుకు వందల కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్టాల్లో అయితే వేగంగా వ్యాపిస్తోంది. ఇంతటి ఉపద్రవం వేళ చావు కబురును ఆర్టీసీ చల్లగా చెబుతోంది..
తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఒక ప్రకటన చేసింది. ఏప్రిల్ 14 నుంచి బస్సు సర్వీసులను పునరుద్దరించేందుకు సిద్ధమవుతోందట.. ఆన్ లైన్ రిజర్వేషన్లు ప్రారంభించినట్టు తెలిపింది. అయితే దూర ప్రాంతాలకు ఏసీ బస్సులను నడపమని.. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రిజర్వేషన్లు ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. బుక్సింగ్స్ ఆధారంగా బస్సుల సంఖ్యను పెంచుతామని వివరించింది.
ఈ ప్రకటనపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఓవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య పుట్టగొడుగుల్లా వేళ్లూనుకుంటున్నాయి. కర్నూలులో ఒక్కరోజే 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారితో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. అంటు వ్యాధి అయిన ఈ కరోనాను కట్టడి చేయలేక ప్రపంచదేశాలు, అమెరికా ఆపసోపాలు పడుతోంది.
ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో దేశంలో సరైన వైద్య సదుపాయాలు కూడా లేని సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ కాసుల కక్కుర్తి కోసం ప్రజలను బలిపెడుతున్న తీరు నివ్వెరపరుస్తోందని విమర్శిస్తున్నారు. ఆర్టీసీకి డబ్బులు, మనగడ కోసం బస్సులు ప్రారంభించి ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరోనా ,లాక్ డౌన్ ముగిసే వరకు మరికొంత కాలం బస్సులు బంద్ చేయాలని.. బస్సుల్లో జనాలు ఎక్కితే కరోనా బాగా వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.