Begin typing your search above and press return to search.
కరోనా వేల కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్ర ప్రభుత్వం?
By: Tupaki Desk | 7 April 2020 9:30 AM GMTఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొదట్లో కరోనా కేసులు రాష్ట్రంలో తక్కువగానే ఉన్నప్పటికీ ఆ తరువాత అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనాలు ఎక్కువగా గుమిగూడే సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, ఫార్మసీలకు దిశానిర్దేశాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. కరోనాను రాష్ట్రంలో కట్టడి చేసే క్రమంలో భాగంగా ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని తెలిపింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 304 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన చేసిన దిశనిర్దేశాలు..
స్టోర్లలో పని చేసేవారికి ఎవరికైన ఫ్లూ, కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వారు రాకూడదు. అలాగే , స్టోర్ లలో రద్దీని తగ్గించేందుకు ఆ యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే వినియోగదారులు సరుకులను రెండు వారాలకు మించి కొనకుండా చర్యలు తీసుకోవాలి అని తెలిపింది. అలాగే సూపర్ మార్కెట్స్ , స్టోర్స్ , మెడికల్ స్టోర్స్ ముందు కస్టమర్ల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి అని ఆదేశించింది.
అలాగే , క్యూ లైన్లలో సామాజిక దూరం పాటించాలి అని , అలాగే వచ్చిన కస్టమర్స్ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి అని యాజమాన్యాలకు చెప్పింది . అంతేకాక 2 మీటర్లు లేదా 6 అడుగుల దూరం ఉండేలా గుర్తులు వేయాలి అని , అలాగే పార్కింగ్ సౌకర్యం ఉన్న దుకాణాలు.. కస్టమర్లకు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా టోకెన్ విధానాన్ని అమలు చేయాలి అని తెలిపింది.
అలాగే , ఆన్ లైన్ షాపింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి.. సరకులను డోర్ డెలివరీ చేయాలి అని తెలిపింది. ఎప్పటికప్పుడు పని చేసేవారి బాడీ టెంపరేచర్ చెక్ చేయడమే కాకుండా స్టోర్ లలో ఇన్, ఔట్ దగ్గర హ్యాండ్ శానిటైజర్ ను ఏర్పాటు చేయాలి అని తెలిపింది. క్యాష్ కౌంటర్ల దగ్గర ఉండేవారు మాస్కులు, గ్లౌజులు ధరించాలి. ఆన్ లైన్ చెల్లింపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆలా కానీ , పక్షంలో కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు వలల ద్వారా తీసుకోవాలి అని తెలిపింది.