Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా కారణంగా మరణించిన తోలి డాక్టర్ !
By: Tupaki Desk | 13 April 2020 6:45 AM GMTకరోనా వైరస్ ఏపీలో అలజడి సృష్టిస్తుంది. తాజాగా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ... నెల్లూరు జిల్లాలో మొట్ట మొదటి కొరోనా మరణం సంభవించింది అని తెలుస్తుంది. నెల్లూరు పట్టణంలోని, కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రసిద్ధ ఆర్థోపెడిక్ వైద్యుడు కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ కన్నుమూశారని ఒక వార్త మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే , ఆ డాక్టర్ కి కరోనా ఎలా సోకింది అనే విషయం ఇంకా తెలియలేదు.
ఇకపోతే ఏపీలో కర్నూల్ , గుంటూరు జిల్లాల తరువాత అత్యధికంగా కరోనా కేసులు నమోదైంది నెల్లూరు జిల్లాలోనే. ఇది ఇలా ఉండగా… అధికారుల ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 420 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 12 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లిన వారిలో 199 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. వారిద్వారా 161 మందికి కరోనా సోకిందని చెబుతున్నారు. ఇతరత్రా మార్గాల వల్ల 32 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో కలిసి కరోనా వైరస్ కేసులు 420 నమోదు కాగా, కేవలం ఐదు జిల్లాల్లోనే 294 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 82 కేసులు, నెల్లూరులో 52, ప్రకాశంలో 41, కృష్ణాలో 35, కడపలో 31 కరోనా కేసుల చొప్పున నమోదయ్యాయి.మరోవైపు కేసులు పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ లో మాస్కులు పంచిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఒక్క పౌరుడికి మూడు మాస్కులు చప్పున ఇవ్వాలని నిర్ణయించారు.