Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా విలయతాండవం ...432కి చేరిన కేసులు, ఆ రెండు జిల్లాల్లోనే !

By:  Tupaki Desk   |   13 April 2020 8:00 AM GMT
ఏపీలో కరోనా విలయతాండవం ...432కి చేరిన కేసులు, ఆ రెండు జిల్లాల్లోనే !
X
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం కొంచెం తక్కువగా కేసులు నమోదు అవుతుండటంతో ఊపిరి పీల్చుకున్న ఏపీ ప్రజలు , అధికారులు ..మళ్లీ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారంరాత్రి 10 గంటల నుంచి.. సోమవారం ఉదయం 10 గంటల వరకు నమోదైన కరోనా పరీక్షల్లో.. మరో 12 కేసులు బయటపడ్డాయి.

వీటిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 8, చిత్తూరు 2.. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తాజా బులిటెన్‌ లో ప్రకటించారు. ఈ 12 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కు పెరిగింది. ఇక మరణాల సంఖ్య 7గా ఉంది. కోలుకున్నవారి సంఖ్య 12గా ఉంది. ప్రస్తుతం ట్రీట్‌ మెంట్ పొందుతున్న వారి సంఖ్య 413గా ఉంది. ఇక పోతే ఏపీలో కరోనాను పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మాస్కులు సరఫరా చేయాలనీ నిర్ణయించిన ప్రభుత్వం ..రోడ్లపై ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించింది. రెడ్ జోన్లు, హాట్ స్పాట్‌ లు ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది.

జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ..
గుంటూరు జిల్లా - 90
కర్నూలు జిల్లా - 84
నెల్లూరు జిల్లా - 52
ప్రకాశం జిల్లా - 41
కృష్ణా జిల్లా -36
కడప జిల్లా - 31
పశ్చిమ గోదావరి జిల్లా - 23
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా - 23
తూర్పుగోదావరి జిల్లా - 17
అనంతపురం జిల్లా -15
మొత్తం కేసులు -432