Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ అమలులో అగ్రస్థానంలో నిలిచిన ఏపీ !
By: Tupaki Desk | 13 April 2020 8:50 AM GMTకరోనా వైరస్ తో ఇప్పుడు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. కరోనా కి మందు లేకపోవడంతో , కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మరో మార్గం లేక లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. మన దేశంలో కూడా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇకపోతే , కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేస్తూ, ఈ వైరస్ చైన్ ను తెగగొట్టడంలో విజయం సాధించిన రాష్ట్రాలలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం దక్కింది.
భారత్ లో లాక్ డౌన్ ను సక్రమంగా పాటిస్తూ కరోనాను కట్టడికి కృషి చేస్తున్న రాష్ట్రాలపై ప్రముఖ జాతీయ న్యూస్ చానెల్ ఎన్డీటీవీ సర్వే నిర్వహించగా ... ఈ సర్వేలో ఏపీ మొదటి స్థానం, కేరళకి రెండో స్థానం దక్కింది. కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకుందని, అందుకే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగ లేదని, లాక్ డౌన్ ను పగడ్భందీగా అమలు చేసి కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో ఏపీ పెద్ద విజయం సాధించిందని ఎన్డీటీవీ ప్రశంసింది.
కాగా, కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. సీఎం జగన్ ప్రతి రోజు సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు . ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. కరోనా నుంచి రక్షణ కల్పిచేందుకు ప్రజల అందరికి మాస్కులు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల కుంటుంబాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. అనారోగ్య లక్షణాలను ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నమోదవుతున్న కేసులు, కరోనా వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలను గుర్తించి జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఏపీలో 432 కేసులు నమోదు అయ్యాయి. కాగా, ఈ ఎన్డీ టీవీ సర్వే వీడియోను మంత్రి పేర్ని నాని ట్వీట్ చేస్తూ ఏపీ లో ఉన్న ఏ ఒక్కరు కూడా భయ పడాల్సిన పని లేదని, కొద్ది రోజులు ప్రభుత్వం చెప్పినట్టు ఇంట్లోనే ఉండాలని కోరారు.