Begin typing your search above and press return to search.

మామకు కరోనా.. సీక్రెట్ గా అల్లుడి పరామర్శ.. ఆపై కేసు బుక్

By:  Tupaki Desk   |   14 April 2020 4:51 AM GMT
మామకు కరోనా.. సీక్రెట్ గా అల్లుడి పరామర్శ.. ఆపై కేసు బుక్
X
పిల్లను ఇచ్చిన మామకు బాగోకపోతే.. ఏ అల్లుడు మాత్రం పరామర్శించకుండా ఉంటాడు. మిగిలిన రోజుల్లో తప్పు కానిది కరోనా వేళ మాత్రం అదో పెద్ద తప్పు కావటమే కాదు.. మెడకు కేసు చుట్టుకునే పరిస్థితి. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమన్న విషయాన్ని మనోళ్లు ఎంత లైట్ గా తీసుకుంటున్నారనటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు.

కరోనా పాజిటివ్ అని తేలిన మామగారిని రహస్యంగా పరామర్శించిన అల్లుడి తీరు ఒక ఎత్తు అయితే.. తన వెంట నాలుగేళ్ల కొడుకును తీసుకెళ్లిన వైనం షాకింగ్ గా మారింది. సూర్యాపేట జిల్లా మిట్టపల్లిలోని తన మామగారింటికి తన నాలుగేళ్ల కొడుకును సెలవులకు పంపాడా అల్లుడు. అతడిది ప్రకాశం జిల్లా. ఇటీవల సదరు మామకు గుండె నొప్పి రావటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు.. మామకు కరోనా పాజిటివ్ అని తేల్చారు.

ఈ విషయం తెలుసుకున్న అల్లుడు.. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి మరీ చీరాల నుంచి గుంటూరుకు రహస్యంగా వెళ్లాడు. ఆసుపత్రికి చేరి మామను పరామర్శించటమే కాదు.. నాలుగేళ్ల కొడుకును తీసుకొని తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఈ విషయం ఎవరికి తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ.. మామను పరామర్శించిన వైనం పోలీసుల వరకూ వెల్లటంతో అతడిపై కేసు నమోదు చేసి.. వారింట్లో వారందరిని క్వారంటైన్ కు పంపారు అధికారులు. కరోనా వేళ.. పరామర్శల్ని బంద్ చేయాల్సిన విషయం కూడా తెలీదా? అంటూ అధికారులు చిరాకు పడుతున్నారు.