Begin typing your search above and press return to search.

గుంటూరులో కరోనా విలయతాండవం..100 దాటిన కరోనా కేసులు!

By:  Tupaki Desk   |   14 April 2020 6:28 AM GMT
గుంటూరులో కరోనా విలయతాండవం..100 దాటిన కరోనా కేసులు!
X
ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి.. మంగళవారం ఉదయం 10 గంటల వరకు కరోనా పరీక్షల్లో.. మరో 34 కేసులు బయటపడ్డాయి. దీనితో ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 473కి చేరింది. తాజాగా బయటపడ్డ 34 కేసుల్లో ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏకంగా 16 కేసులు నమోదయ్యాయి. కృష్ణలో 8 - కర్నూలులో 7 - అనంతపురంలో 2 - నెల్లూరులో ఒక కేసు నమోదయ్యాయి.

దీనితో ఏపీలో కరోనా కేసులో గుంటూరు అగ్ర స్థానాల్లో నిలిచింది. అలాగే కేసులు కూడా 100 దాటిపోయాయి. దీనితో జిల్లా ప్రజలలో ఆందోళన మొదలైంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇప్పటివ రకు 109 కేసులు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. జిల్లాలో లాక్ డౌన్ నిబంధనల్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఇకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. 9 మంది చనిపోయారు.

కరోనాని కంట్రోల్ చెయ్యడానికి ప్రభుత్వం ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంది. రోజురోజుకూ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఇప్పుడు లాక్‌ డౌన్ మే 3 వరకూ అమల్లో ఉంటుంది కాబట్టి... మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల్లో గుంటూరు జిల్లా టాప్‌లో ఉండగా ... శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఏపీలోని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు :

గుంటూరు జిల్లా - 109
కర్నూలు జిల్లా - 91
నెల్లూరు జిల్లా - 56
ప్రకాశం జిల్లా - 41
కృష్ణా జిల్లా -44
కడప జిల్లా - 31
పశ్చిమ గోదావరి జిల్లా - 23
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా - 23
తూర్పుగోదావరి జిల్లా - 17
అనంతపురం జిల్లా -15
శ్రీకాకుళం జిల్లా - 0
విజయనగరం జిల్లా - 0