Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: టిఫిన్ బండి వ్యాపారికి కరోనా పాజిటివ్ !
By: Tupaki Desk | 14 April 2020 10:30 AM GMTఏపీని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మంగళవారం బులిటెన్ ప్రకారం కొత్తగా 34 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 473కు చేరింది. వీటిలో గుంటూరు జిల్లాలో 16 - కృష్ణా జిల్లాలో 8 - కర్నూలు జిల్లా 7 - అనంతపురం జిల్లాలో రెండు.. నెల్లూరు జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇలా ఒక్కసారిగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క గుంటూరు జిల్లాలో 109 కేసులు నమోదయ్యాయి.
కాగా , తాజాగా విజయవాడలో టిఫిన్ బండి వ్యాపారికి కరోనా పాజిటివ్ రావడం కలకలంరేపింది. రాణిగారితోట ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ వైరస్ సోకకు ముందు వరకూ టిఫిన్ అమ్మేవాడు. అయితే టిఫిన్ సెంటర్ యజమానికి పానీపూరి వ్యాపారి నుంచి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. పానీపూరి బండి వ్యక్తి మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
రాణీగారితోటలో ఇద్దరు వ్యాపారులకు కరోనా రావడంతో స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అధికారులు రాణీగారితోటను రెడ్ జోన్ గా ప్రకటించారు. దీనితో అక్కడ లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. అలాగే అదే ప్రాంతంలోని ఇద్దరికి కరోనా పాజిటివ్ గా రావడంతో ..అక్కడ ఉన్న వారందరికీ కరోనా టెస్టులు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.