Begin typing your search above and press return to search.

ఆశ్చ‌ప‌రుస్తున్న రిపోర్టులు: క‌రోనా ల‌క్ష‌ణాలు లేకున్నా పాజిటివ్‌!?

By:  Tupaki Desk   |   16 April 2020 12:30 PM GMT
ఆశ్చ‌ప‌రుస్తున్న రిపోర్టులు: క‌రోనా ల‌క్ష‌ణాలు లేకున్నా పాజిటివ్‌!?
X
ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోదవుతున్న జిల్లా గుంటూరు. ఈ జిల్లాలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే 118మందికి క‌రోనా వైరస్ సోకింది. దీంతో జిల్లా అప్ర‌మ‌త్తంగా ఉంది. ఈ మేర‌కు నివార‌ణ చ‌ర్య‌లు అధికార యంత్రాంగం తీసుకుంది. అయితే ఈ జిల్లాలో క‌రోనా కేసులు మాత్రం వైద్యుల‌న్నీ ఆశ్చ‌ర్య‌ ప‌రుస్తున్నాయి. క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు.. ఆరోగ్యవంతంగా కనిపిస్తున్నారు.. అయితే వారికి క‌రోనా పాజిటివ్ సోకింది. దీంతో వైద్యులు ఆశ్చ‌ర్య‌ పోతున్నారు. వారిలో ఎలాంటి క‌రోనా లక్షణాలు కనిపించకున్నా ఏకంగా వంద మందికి కరోనా సోకడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టుల్లోనూ వైరస్‌ నిర్ధారణ చేయ‌గా కరోనా పాజిటివ్‌ గా రిపోర్టులు వచ్చిన ఈ వంద మందిని ప‌రిశీలించారు. జిల్లాలో ఇప్పటివరకు 118 మందికి కరోనా పాజిటివ్‌ రిపోర్టులు వ‌చ్చాయి. అయితే వారిలో వంద మందికి ఎలాంటి జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడం కష్టం కావడం వంటి కరోనా లక్షణాలేవి కనిపించ లేదు. దీంతో వారంతా తమకు క‌రోనా వైర‌స్‌ సోకలేదేమోనని భావిస్తున్నారు. వాస్త‌వంగా103 డిగ్రీల వరకు జ్వరం, శ్వాస తీసుకోవ‌డం లో ఇబ్బంది, పొడిదగ్గు కావడం వంటివి క‌రోనా లక్షణాలని అంద‌రికీ తెలుసు. అయితే జిల్లాలో నమోదైన కరోనా బాధితుల్లో ఆ లక్షణాలు కనిపించక‌ పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ జిల్లాలో విదేశాల నుంచి జిల్లాకు తిరిగొచ్చిన వారిని గుర్తించి వారి ఇళ్లలోనే క్వారంటైన్‌ చేశారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి తిరిగొచ్చిన తొమ్మిది మంది వల్ల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ పెరిగి పోయాయి. కొన్ని కేసుల్లో అయితే వారికి వైరస్‌ ఎలా సోకిందో కూడా తెలియని పరిస్థితి. అధికారులు వారి వివ‌రాలు సేక‌రించి వారి కాంటాక్ట్స్‌ని గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించ‌గా వైరస్‌ సోకిందని తేలింది. అయితే వారికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు.