Begin typing your search above and press return to search.
దిశ పోలీస్ స్టేషన్ లో కరోనా అలజడి... క్వారంటైన్ లోకి పోలీసులు !
By: Tupaki Desk | 23 April 2020 6:45 AM GMTఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోవడంతో అధికారులు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లాక్ డౌన్ పటిష్టంగా అమలుచేస్తున్నా వివిధ కారణాల వల్ల కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా బెజవాడ దిశ పోలీస్ స్టేషన్ లో కరోనా అలజడి సృష్టించింది. మానవత్వంతో అనారోగ్యంతో ఉన్న మహిళను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించిన దిశ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఇప్పుడు కరోనా భయం వెంటాడుతుంది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..విజయవాడలో ఈ నెల 19వ తేదీన స్ధానికంగా ఓ మహిళ అస్వస్దతకు గురైంది. దీనితో ఆమె గ్లోబల్ ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన డాక్టర్లు కరోనా అనుమానంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆస్పత్రికి చెందిన వాహనాలు అందుబాటులో లేకపోవడంతో స్ధానిక పోలీసు వాహనంలో ఇద్దరు పోలీసులు ఆమెను పాత ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఓపీ సేవలు అందుబాటులో లేవని చెప్పడంతో కొత్త ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అక్కడ కరోనా కేసులకు మాత్రమే చికిత్స అందిస్తుండటంతో ఈఎస్ ఈ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లి సరికి ఆమె చనిపోయింది. అయితే , అనుమానం తో ఆమెకి కరోనా నిర్దారణ పరీక్ష చేయగా ..పాజిటివ్ గా తేలింది. దీనితో ఆమెకు సాయం చేసిన దిశ పోలీసు స్టేషన్ ఎస్సై, సైబర్ నిపుణుడు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు.
దిశ పోలీసులే కాబట్టి మహిళగా ఆమెకు సాయం చేసేందుకు వెళ్లి ఇబ్బందులు కొనితెచ్చుకున్నారని ఇప్పుడు బాధపడుతున్నారు. దీనితో వారిద్దరితో పాటుగా ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులందరిని హోమ్ క్వారంటయిన్ లో ఉండాలని సిపి ఆదేశాలు జారీచేశారు. ఆ మహిళ ఎక్కడినించి వచ్చిందీ, ఆమె వచ్చిన వాహనం ఏంటి? కుటుంబం వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇకపోతే ఇప్పటి వరకు ఏపీలో 813 కరోనా కేసులు నమోదు కాగా ..24 మంది మరణించారు.