Begin typing your search above and press return to search.
ఏపీలో జోరు చూపిస్తున్న కరోనా ..కొత్తగా మరో 62 కేసులు!
By: Tupaki Desk | 24 April 2020 5:40 AM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (గురువారం ఉదయం 9 నుండి శుక్రవారం ఉదయం 9 వరకు ) రాష్ట్రంలో 62 కొత్త కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. 6306 శాంపిల్స్ ను ల్యాబ్ లో పరీక్షించగా ..62 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. కొత్తగా నమోదు అయిన కేసులతో కలుపుకుని ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955కు చేరింది. వీరిలో 145 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 781గా ఉంది. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటివరకు 29 మంది చనిపోయారు. కొత్త నమోదైన కేసుల్లో కర్నూలు 27 - అనంతపురం 4 - తూర్పు గోదావరి 2 - గుంటూరు 11- కృష్ణా 14- ప్రకాశం జిల్లాలో 3 కేసులు ఉన్నాయి.
ఏపీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన జిల్లాల జాబితాతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా ..గుంటూరు రెండో స్థానంలో ఉంది. కర్నూలులో 261 కేసులు నమోదు కాగా, గుంటూరులో 206 కేసులు నమోదు అయ్యాయి. ఇక కృష్ణాలో 102 - నెల్లూరులో 68 - చిత్తూరులో 73 కేసులు నమోదయ్యాయి.. శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఇకపోతే , ఇప్పటివరకు తెలంగాణ లో 970 కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ కాగా.. 25 మంది చనిపోయారు. అలాగే 262 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 693 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే.. గడిచిన 24 గంటల్లో ఈరోజు ఉదయం 8 గంటల నాటికి పలు రాష్ట్రాల్లో 1684 కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ కాగా.. 37 మంది కరోనాతో మృతి చెందారు. దీనితో దేశంలో మరణాల సంఖ్య 718కు చేరుకుంది. అలాగే దేశంలో కరోనా బాధితుల సంఖ్య 23వేలు దాటింది.