Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా తీవ్రతకు సరిహద్దుల్లో గోడ కట్టిన తమిళనాడు
By: Tupaki Desk | 27 April 2020 6:20 AM GMTకరోనా భయం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. మనుషులను నిలువునా విడదీస్తుంది. సొంత కుటుంబ సభ్యులను దూరంగా పెడుతోంది. ఆ మహమ్మారి సోకితే ఇక బంధాలు భవబందాలు ఉండవు. అనాథ శవాలను వదిలేస్తున్న దైన్యం విదేశాల్లో చూస్తున్నాం. అమెరికాలో అయితే వేరే దేశం వారు రాకుండా నిషేధించారు. మెక్సికో, కెనడా బార్డర్లో గోడలు కట్టేశారు.
ఇప్పుడు ఏపీలో కరోనా తీవ్రతకు కూడా ఇలాంటి చర్య తీసుకుంది పక్కనున్న తమిళనాడు రాష్ట్రం. అవును.. ఇన్నాళ్లు సరిహద్దును.. బంధాలను పంచుకున్న రాష్ట్రం ఇప్పుడు ఏపీలో కరోనా తీవ్రతకు భయపడి ఏకంగా గోడకట్టేసింది. ఈ అమానవీయ సంఘటన ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో చోటుచేసుకుంది.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా 1100కు కేసులు చేరువయ్యాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి కరోనా తమిళనాడు కు పాకకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తాజాగా ఏపీలో కరోనా తమిళనాడులోని గ్రామాలకు పాకకుండా ఉండేందుకు చిత్తూరు జిల్లా సరిహద్దు తో ఆనుకొని ఉన్న తమిళనాడులోని వేలూరు జిల్లా బార్డర్లో ఏకంగా గోడ కట్టేశాడు వేలూరు కలెక్టర్.
ఇప్పటికే కరోనాతో చెన్నైని పూర్తిగా లాక్ చేశారు. కరోనా వ్యాప్తితో ప్రభుత్వం అప్రమత్తమైంది. తమిళనాడులోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు కట్టడి చేస్తున్నారు. దీంతో ఏపీ నుంచి కొత్త కేసులు విస్తరించకుండా ఇలా సరిహద్దుల్లో గోడ కట్టేయడం సంచలనంగా మారింది.