Begin typing your search above and press return to search.
నెగటివ్ అని ఇంటికి వెళ్లామన్నారు..మళ్లీ పాజిటివ్ అని తీసుకెళ్లారు!
By: Tupaki Desk | 27 April 2020 8:30 AM GMTఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత నాలుగు రోజులుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఇదే సమయంలో కొన్ని చిత్రమైన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. నీకు కరోనా నెగిటివ్ వచ్చింది, ఇంటికి వెళ్లిపోమని పంపించిన అధికారులు. ఆ తరువాత రోజే అయ్యో నీకు కరోనా నెగటివ్ రాలేదు అంటూ.. మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన విజయవాడ లో వెలుగు చూసింది.
ఈ ఘటకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. కరోనా టెస్టుల తీరుపై కరోనా బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన పేషేంట్ వీడియోలో ఏం చెప్పాడో ఒకసారి పరిశీలిస్తే.. తాను లారీ డ్రైవర్ గా పని చేస్తాను. నాకు కరోనా లక్షణాలు కనపడటంతో నా ఫ్యామిలీ మెంబర్స్ - మా కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో డ్యూటీ నుంచి నేరుగా ఆస్పత్రికి స్వచ్ఛందంగా వెళ్లాను అని - 10 రోజులు ఆసుపత్రిలో ఉంచి - రెండు సార్లు స్వాబ్ టెస్టులు చేశారు అని - నెగిటివ్ వచ్చిందని కృష్ణలంక రామ లింగేశ్వర నగర్ లో మా ఇంటికి పంపించేశారు అని తెలిపాడు.
అయితే, ఆలా నేను ఏటికి వెళ్లిన మరుసటి రోజే మళ్లీ కొంతమంది వచ్చి - నీకు కరోనా పాజిటివ్ వచ్చిందని తీసుకెళ్లారని తెలిపాడు. నెగటివ్ వచ్చింది అని ఒకరోజు ఇంట్లో - కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న తర్వాత - మళ్లీ అధికారులు ఇలా చేయటం వల్ల నా కుటుంబం - మా రోడ్డులోని వారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ తరహా ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .