Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా హైరిస్క్ లో ఉన్న వారు అన్ని వేల మందా?

By:  Tupaki Desk   |   2 May 2020 4:15 AM GMT
ఏపీలో కరోనా హైరిస్క్ లో ఉన్న వారు అన్ని వేల మందా?
X
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కరోనా నిర్దారణ పరీక్షల్ని పెద్ద ఎత్తున చేపడుతోంది ఆంధ్రప్రదేశ్. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో లక్షకు పైనే టెస్టుల్ని నిర్వహించారు. ఈ కారణంతోనే పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు బయటకు వస్తున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటంపై ఏపీ సర్కారు ఆందోళన చెందటం లేదు. ఎందుకంటే.. వైరస్ మూలాల్లోకి తాము వెళుతున్నామని.. పరీక్షల్ని పెద్ద ఎత్తున చేయటం ద్వారా.. అన్ని వర్గాల వారిని కవర్ చేయటం తో పాటు.. కేసుల వ్యాప్తిని తాము అడ్డుకుంటున్నామన్న విషయాన్ని మర్చి పోవద్దంటున్నారు.

ఇదిలా ఉంటే.. కరోనా హైరిస్కుతో ఉన్న వారి సంఖ్య నాలుగు వేలుగా ఉన్న విషయాన్ని తాజాగా గుర్తించినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కుటుంబ సర్వే ద్వారా 32,792 మందిలో 17,585 మందికి కరోనా నిర్దారణ పరీక్షల్ని నిర్వహించినట్లుగా చెబుతున్నారు రానున్న రెండు రోజుల్లో మిగిలిన వారికి పరీక్షలు పూర్తి చేస్తామని చెబుతున్నారు.

కుటుంబ సర్వేతో గుర్తించిన వారిలో నాలుగు వేల మందిలో కరోనా హైరిస్కు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందిస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాల్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాల్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వారంతా ఒక్కసారిగా స్వస్థలాలకు చేరుకుంటారని.. అలాంటివారిని గుర్తించి.. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరి నుంచి శాంపిల్స్ తీసుకోవటం.. ఆ తర్వాతే ఇళ్లకు పంపాలన్న విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్న ఆలోచనలో ఏపీ ఉన్నట్లు చెబుతున్నారు.