Begin typing your search above and press return to search.

ఏపీ: నిన్న కోయంబేడు...నేడు అజ్మీర్!

By:  Tupaki Desk   |   16 May 2020 2:30 PM GMT
ఏపీ: నిన్న కోయంబేడు...నేడు అజ్మీర్!
X
ఏపీలో మహమ్మారి టెంక్షన్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా 48 మంది ఈ వైరస్ భారిన పడినట్టు తెలింది. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2205కి చేరింది. అయితే , వీటిలో 1353 మందికి కరోనా తగ్గిపోయింది. అలాగే, మరో 49 మంది ప్రాణాలు విడిచారు. ఇక 803 మంది హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే , రాష్ట్రంలో వైరస్ నిర్దారణ టెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనితో వీలైనంత త్వరగా ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చు అని అనుకుంటున్నారు.

అయితే ,రాష్ట్రాల్లో మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయి అని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో వైరస్ బాధ తప్పడం లేదు. ఢిల్లీ మర్కజ్ - కోయంబేడు తర్వాత తాజాగా అజ్మీర్ వలస కూలీల రూపంలో కేసులు వెంటాడుతున్నాయి. చిత్తూరుతో పాటూ మరో ఒకటి రెండు జిల్లాలకు ఈ టెన్షన్ తప్పడం లేదు. చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఒక్క రోజే 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోయంబేడు లింకుల వల్ల 14మందికి వైరస్ సోకితే.. అజ్మీర్‌ నుంచి వచ్చిన వలస కూలీల్లో 11 మందికి పాజిటివ్‌ తేలింది.

ముందు విదేశాల నుంచి వచ్చినవారికి వైరస్ సోకింది.. తర్వాత ఢిల్లీ మర్కజ్‌ కు వెళ్లి వచ్చిన వారి ద్వారా వ్యాపించింది. ఆ బాధితులు కోలుకున్నారు.. ఇంతలో చెన్నై కోయంబేడు మార్కెట్‌ తో సంబంధాలు ఉన్నవారి ద్వారా మళ్లీ బాధితుల సంఖ్య పెరిగింది. తాజాగా అజ్మీర్‌‌ నుంచి వచ్చిన వారు టెన్షన్ పెడుతున్నారు. అక్కడి నుంచి వచ్చిన కొందరికి పాజిటివ్‌ వచ్చినట్టు తేలింది. దీంతో అధికారులు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీల పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే చాలా మందిని గుర్తించి క్వారంటైన్‌ కు పంపింది. మరోవైపు అజ్మీర్‌ నుంచి వచ్చిన వారంతా ఎవరినీ కలవకుండా అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు పంపి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ తేలితే ఆస్పత్రులకు పంపిస్తున్నారు.