Begin typing your search above and press return to search.

కరోనా బాధితులను చంపేస్తున్న చైనా.. నిజమెంత?

By:  Tupaki Desk   |   8 Feb 2020 5:30 AM GMT
కరోనా బాధితులను చంపేస్తున్న చైనా.. నిజమెంత?
X
చైనా అంటే నిరంకుశ దేశం.. కమ్యూనిస్టులు తరాలుగా పాలిస్తున్న ప్రాంతం.. అక్కడ ఎన్నికలుండవు. కమ్యూనిస్టు నేతలే తమ వారసులను అధ్యక్షులుగా ఎన్నుకుంటారు. అంతా నిర్భంధమే..పని, ఉద్యోగాలు, వేతనాలు ఇలా కఠిన ఆంక్షలుంటాయి. అంతటి కరుడగట్టిన దేశంలో ‘కరోనా’ వైరస్ అల్లకల్లోలం చేస్తోంది. దాదాపు 28వేల మందికి సోకింది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కు చెక్ చెప్పేందుకు చైనా కష్టపడుతోంది. రెండు రోజుల్లో 1000 పడకల ఆస్పత్రిని కరోనా వైరస్ పుట్టిన వూహాన్ లో నిర్మించి అబ్బుర పరిచింది. ఇలా కరోనాకు విరుగుడు చర్యలు తీసుకుంటున్నా అక్కడ వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ప్రస్తుతం యాంటీ వైరస్ కనుగొనే పనిలో విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి.

దీంతో చైనా ప్రభుత్వం వైరస్ సోకిన 20వేల మంది వ్యాధిగ్రస్తులను చంపేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిందని.. వారిని చంపేస్తారని సోషల్ మీడియాలో ఒకటే తెగ ప్రచారం సాగింది. ఈ వార్త విని ప్రపంచమే నివ్వెర పోయింది. నిజంగా వైరస్ ను కట్టడి చేయడానికి చైనా 20వేల మంది వైరస్ బాధితులను చంపేస్తుందా అని ఆందోళన చెందాయి.

ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థలన్నీ చైనా ప్రభుత్వాన్ని సంప్రదించగా అదంతా ఫేక్ న్యూస్ అని.. సోషల్ మీడియాలో ఎవరో వదంతులు వ్యాపింప చేస్తున్నారని.. తాము కరోనా వైరస్ బాధితులను చంపడం లేదని.. వారికి మెరుగైన చికిత్సనందిస్తున్నామని తెలిపింది. దీంతో సోషల్ మీడియా సర్క్యూలేట్ అవుతున్న ప్రచారం ఉట్టి గాలి వార్త అని తేలింది.