Begin typing your search above and press return to search.

ప్రపంచ సంచలన ఆసుపత్రి తాజా ఆప్డేట్ తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   16 April 2020 3:15 AM GMT
ప్రపంచ సంచలన ఆసుపత్రి తాజా ఆప్డేట్ తెలిస్తే అవాక్కే
X
వెయ్యి పడకల ఆసుపత్రిని కేవలం పది రోజుల్లో నిర్మించటమే కాదు.. కరోనా వైరస్ బాధితులకు వైద్య సాయం అందించిన వైనం తెలిసిందే. యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తటమే కాదు.. ఇలాంటి అద్భుతాలు కేవలం చైనాలోనే సాధ్యమని నిరూపించారు. ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న కరోనా వేళ.. దాని పుట్టినిల్లు అయిన వూహాన్ లో వేలాది మంది ఇబ్బందులకు గురి కావటం తెలిసిందే.

అంతకంతకూ పెరిగిపోతున్న రోగుల తాకిడికి తగ్గట్లు.. రికార్డు సమయంలో కేవలం పది రోజుల వ్యవధిలో వెయ్యి బెడ్లున్న ఆసుపత్రిని సిద్ధం చేయటం ప్రపంచ వ్యాప్తంగా అందరూ చైనా వైపు చూడటమే కాదు.. వావ్.. అమేజింగ్ అన్న మాట అందరి నోటా వచ్చింది. సంక్షోభ సమయాల్లో ఇలా వ్యవహరించటం చైనాకు మాత్రమే సాధ్యమన్న భావన వ్యక్తమైంది.

తాజాగా కరోనా ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అయిన వేళ.. రికార్డు వ్యవధిలో నిర్మించిన వూహాన్ ఆసుపత్రిని ఏం చేశారు? అన్న డౌట్ రాక మానదు. బుధవారం సదరు ఆసుపత్రిని క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గిపోవటంతో సదరు ఆసుపత్రి అవసరం లేదని తేల్చిన ప్రభుత్వం.. దాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో పని చేసే సిబ్బందిని వారి స్వస్థలాలకు పంపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. మానవ అద్భుతానికి నిలువెత్తు రూపంగా ఉన్న ఆసుపత్రి రానున్న రోజుల్లో మాయం కానుంది. ప్రాక్టికల్ గా వ్యవహరిచటంపై ఎవరెన్ని చెప్పినా.. చైనా ప్రభుత్వం మాదిరి ఆలోచించటం మాత్రం ఎవరికీ సాధ్యం కాదన్నది వూహాన్ ఆసుపత్రి ఎపిసోడ్ లో స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.