Begin typing your search above and press return to search.
చైనా శాస్త్రవేత్తల సంచలన ప్రకటన: కరోనా పూర్తిగా పోదు.. ప్రతియేటా వ్యాప్తి
By: Tupaki Desk | 30 April 2020 12:30 AM GMTకరోనా వైరస్ ను పూర్తిగా భూగోళం నుంచి తరిమివేయడం కుదరదని, ఇప్పుడు ఆ వైరస్ కట్టడి కోసం చేపడుతున్న చర్యలు తాత్కాలికమేనని, ఆ వైరస్ ప్రతి సంవత్సరం వస్తుందని చైనా శాస్త్రవేత్తలు సంచలన ప్రకటన చేశారు. ఆ వైరస్‌ను నిర్మూలించలేమని స్పష్టం చేశారు. సాధారణంగా వచ్చే వ్యాధుల మాదిరి కరోనా వైరస్ కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 17 ఏళ్ల క్రితం ప్రబలిన సార్స్ (SARS) వైరస్ మాదిరిగా ఈ వైరస్ అంతమైపోయేది కాదని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో ఈ వైరస్ జ్వరం వంటి లక్షణాలు కనిపించకుండానే వ్యాపించి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుందని ఆందోళనకర విషయం తెలిపారు.
ఇలాంటి వైరస్‌ల గ్రూపును అసింపథిటిక్ (లక్షణ రహిత) వాహకాలుగా పిలుస్తారు. ఇలాంటివారి నుంచి వైరస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో గుర్తించలేమని చైనీస్ వైరల్ గ్రూపు, మెడికల్ రీసెర్చర్లు వెల్లడించారు. సార్స్ (SARS) వ్యాధి సోకిన వారంతా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. ఇతరుల నుంచి ఒకసారి వారిని క్వారంటైన్ చేసినప్పుడు ఆ వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది. అయితే దానికి విరుద్ధంగా కరోనా లక్షణాలు ఉంటాయి. ప్రస్తుతం చైనాలో కరోనాను కంట్రోల్‌లోకి తెచ్చినా ఆ దేశంలో ప్రస్తుతం ప్రతిరోజు లక్షణాలు కనిపించని ఎంతో మందికి ఇంకా వైరస్ వ్యాపిస్తోనే ఉందని గుర్తుచేస్తున్నారు. కరోనా మనతో సుదీర్ఘకాలం పాటు మనుగడ సాగిస్తుందని తేల్చిచెప్పారు.
సీజనల్ వ్యాధుల మాదిరిగానే కరోనా వైరస్ కూడా వ్యాపిస్తుందని చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాతజిన్ బయోలజీ (Institute of Pathogen Biology) తెలిపింది. వేసవి కాలంలో కరోనా కేసులు తగ్గుతాయని కూడా చెప్పలేమని పేర్కొంది. వ్యాక్సిన్ కనిపెడితే వెంటనే కరోనా నివారణకు చర్యలు తీసుకోవచ్చని.. అయితే ఆ వైరస్ లక్షణాలు చూపకపోవడంతోనే కరోనా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ఈ వైరస్‌పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.