Begin typing your search above and press return to search.
అక్కడినుండి వచ్చేవారందరు న్యూక్లిక్ యాసిడ్ టెస్టు చేయించుకోవాలి : చైనా
By: Tupaki Desk | 4 May 2020 5:30 PM GMTకరోనా మహమ్మారి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో లాక్ డౌన్ ను ఎత్తివేసింది. ఇప్పటికే దేశీయ విమాన ప్రయాణాలకు అనుమతినిచ్చిన డ్రాగన్ దేశం.. సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కో నుంచి బీజింగ్ కు వచ్చేందుకు ప్రయాణికులను అనుమతించింది. అయితే చైనా ఎయిర్ లైన్స్ లో ప్రయాణించేవారు విధిగా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు (ఆర్ ఎన్‌ఏ, డీఎన్ ఏ) ఫలితాల వివరాలు తమకు సమర్పించాలని తెలిపింది.
ఆ పరీక్షలో నెగటివ్ ఫలితాలు వచ్చిన వారే తమ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించేందుకు అర్హులని షరతు విధించింది. మే 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని... ప్రయాణానికి 120 గంటల ముందు టెస్టు వివరాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా రష్యాలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఒక్కరోజే అక్కడ దాదాపు 10 వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో సగం కేసులు రాజధాని మాస్కోకు చెందినవే. దీనితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అలాగే , మాస్కో నుంచి వచ్చే ప్రయాణికులకు షరతు విధించిన చైనా ఎయిర్ లైన్స్... రాజధాని బీజింగ్ సహా ఇతర ప్రధాన పట్టణాలకు వచ్చే విమాన ప్రయాణికులు తప్పనిసరిగా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు చేయించుకోవాలని , ఆ తర్వాత సెంట్రలైజ్‌డ్ క్వారంటైన్ కు వెళ్లాలని, అనంతరం ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని , ప్రయాణం తర్వాత కేవలం ఒకే ఒక వ్యక్తిని మాత్రమే నేరుగా కలిసేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు చైనా ఎయిర్‌లైన్స్ అధికారిక సైట్ లో ఓ ప్రకటన విడుదల చేసింది.