Begin typing your search above and press return to search.
వద్దు వద్దంటున్న కరోనా పరీక్షలు... పాపం చైనీయులు!
By: Tupaki Desk | 5 May 2022 12:11 PM GMTచైనాలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్నాయి. కేసులు పెరుగుతున్నా కొద్దీ అక్కడి ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలను మరింత పెంచుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలంతా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఓ వైపు కరోనా బాధ కాగా... మరో వైపు ఆకలితో అలమటిస్తున్నారు. ఏం చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ మీద లాక్ డౌన్ విధిస్తూ... కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
ప్రజలు బయట కనిపిస్తే చాలు ఏదో జంతువుని పట్టుకొని పోయినట్లుగా పట్టుకొని మరీ ఐసోలేషన్ లో పెట్టేస్తున్నారు. అంతేనా కాస్త అనుమానం వచ్చినా బలవంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో ప్రజలు లాక్ డౌన్ అన్నా, ప్రభుత్వాధికారులు అన్నా విపరీతంగా భయపడిపోతున్నారు. కరోనా పరీక్షలను తప్పించుకునేందుకు ఎన్నెన్నో ప్లాన్ లు వేస్తున్నారు. అయితే షాంఘై తదితర ప్రాంతాల్లో కరోనా లక్షణాలు లేకున్నా ఐసోలేషన్ కి పంపిస్తున్నారు. అందుకే అక్కడి ప్రజలంతా షాంఘై నగరాన్ని వదిలి వెళ్లిపోతున్నారు.
తాజాగా చైనాలో బలవంతంగా ఓ యువకుడికి కరోనా పరీక్షలు చేశారు. జంతువును లాక్కొచ్చినట్లు లాక్కొచ్చి.. ఒకరు గట్టిగా తల పట్టుకోగా మరొకరు కరోనా నిర్ధారణ పరీక్ష కోసం ముక్కు నుంచి సాంపిల్స్ తీసుకున్నారు.అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారంతా... అయితే మరీ ఇంత బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. కొంచెం కూడా జాలి లేకుండా.. మరీ ఇలా చేయడం ఏం బాగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
కేవలం పరీక్షలే కాకుండా లాక్ డౌన్ ల వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చైనీయులు చెబుతున్నారు. మొన్నటి వరకు కరోనా సోకిన వారి ఇళ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వారిని బయటకు రానీయలేదని వాపోయారు. అలాగే ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది కానీ... తినేందుకు మాత్రం నిత్యావసర సరుకులు కానీ ఆహారం కానీ అందించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి నుంచి ప్రభుత్వం పెడుతున్న బాధలను భరించలేకు పట్టణాన్ని వదిలి వెళ్లిపోతున్నారు.
అయితే ఇందులోనూ చాలా సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. గతంలో 40 నుంచి 50 డాలర్లు మాత్రమే తీసుకుని ప్యాకర్స్ అండ్ మూవర్స్ ప్రస్తుతం 400 నుంచి 500 వరకు డాలర్లు తీసుకుంటున్నాని వాపోతున్నారు. కానీ బాధలు భరించలేక ఎంత డబ్బులు ఖర్చు అయినా పట్టణాన్ని వదిలి వెళ్లేందుకు షాంఘై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు.