Begin typing your search above and press return to search.
విరాళాల కోసం అదిరే ప్లాన్ వేసిన దుబాయ్ సర్కార్
By: Tupaki Desk | 4 May 2020 5:15 AM GMTకరోనా పుణ్యమా అని ప్రపంచంలోని పలు దేశాలు కుదేలయ్యాయి. అప్పటివరకూ సంపన్న దేశాలుగా వెలిగిపోయిన దేశాలకు సైతం ఆర్థిక సమస్యల తీవ్రత అర్థమయ్యేలా చేసింది కంటికి కనిపించిన మాయదారి వైరస్. కరోనా కారణంగా ప్రపంచంలోని పలు దేశాలు లాక్ డౌన్ ను విధించింది. దీని కారణంగా ఉపాధి కోల్పోయిన ఎంతోమంది పేదలకు రోజు గడవటం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితి అన్ని దేశాల్లోనూ ఉంది. ఇదిలా ఉంటే.. సంపన్న దేశాల్లో ఒకటైన దుబాయ్.. కరోనా కారణంగా ఎదురయ్యే ఆకలి కేకల్ని కట్టడి చేయటానికి వీలుగా ప్రపంచంలో అతి పెద్ద విరాళాల సేకరణకు తెర తీసింది. దీనికి సంబంధించిన ఆ దేశం సిద్ధం చేసిన ఐడియా వినూత్నంగా ఉందని చెప్పాలి.
కరోనా వేళ ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించేందుకు వీలుగా యూఏఈ ఆసక్తికర పథకానికి తెర తీసింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ది బుర్జ్ ఖలీఫా భవనాన్ని మొత్తం 12 లక్షల ఎల్ ఈడీ లైట్లతో వెలిగించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఒక లైటు వెలగాలంటే 2.7 డాలర్ల మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని కోరారు. ఆ చిన్న మొత్తం విరాళంగా ఇచ్చినంతనే ఒక ఎల్ ఈడీ లైటు వెలుగుతుంది. 2,717 అడుగుల ఎత్తున్న ఈ భారీ భవనానికి 12 లక్షల లైట్లను అమర్చారు.
పవిత్ర రంజాన్ మాసంలో భారీ ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే నేపథ్యంలో.. ఈ విరాళాల్ని సేకరించటం ద్వారా దేశంలోని శ్రామికజీవుల ఆకలి తీర్చేలా ప్లాన్ చేసింది యూఏఈ సర్కారు. అనుకున్నట్లే ఈ పథకానికి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఈ లైట్ల పథకాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే 1.76లక్షల మందికి భోజనం అందించేందుకు వీలుగా విరాళాలు వచ్చినట్లుగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. చాపకింద నీరులా పాకిన కరోనాతో దుబాయ్ సైతం విలవిలలాడుతోంది. ఇప్పటి వరకూ ఆ దేశంలో 14వేల మందికి కరోనా సోకగా.. 126 మంది ప్రాణాల్ని కోల్పోయారు.