Begin typing your search above and press return to search.

7 కోట్ల బుజ్జి దేశంలో కోటి కేసుల మార్క్ దాటేసింది

By:  Tupaki Desk   |   3 Jan 2022 12:30 AM GMT
7 కోట్ల బుజ్జి దేశంలో కోటి కేసుల మార్క్ దాటేసింది
X
అధికారికంగా కాదు కానీ అనధికారికంగా హైదరాబాద్ మహా నగర జనాభా దగ్గర దగ్గర 2 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు మేం చెప్పే సంఖ్య.. హైదరాబాద్ నగరానికి శివారుగా ఉండే రంగారెడ్డి.. మల్కాజిగిరి.. మెదక్ జిల్లాల సరిహద్దుల్లోని జనాభాతో లెక్కిస్తే.. రూ.2కోట్ల వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడీ పోలిక ఎందుకంటే.. హైదరాబాద్ జిల్లా విస్తీర్ణం 47,863 చదరపు మైళ్లు. ఎందుకు ఇదంతా అంటే.. ఇంత చిన్న విస్తీర్ణంలో ఇంత జనాభా ఉంటే.. 2,47,368 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండే చిట్టి దేశం ఫ్రాన్స్. ఎందుకంటే.. తిప్పి కొడితే ఆ దేశ జనాభా ఏడు కోట్లను మించదు. అందుకే చిట్టి దేశమని పిలిచింది. మన దేశంలోని ఒక మహా నగర జనాభాతో పోలిస్తే.. ప్రాన్స్ లాంటి దేశ జనాభా తక్కువనే చెప్పాలి. అలాంటి దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.

ఇటీవల కాలంలో మరోసారి భారీగా విస్తరిస్తున్న కరోనా కేసుల సంఖ్య కోటి మార్కును దాటేసింది. ఒక దేశంలో కోటి కరోనా కేసులు నమోదైన ఆరో దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 2.19 లక్షల కేసులు నమోదయ్యాయి. అంతకంతకూ ఎక్కువ అవుతున్న కేసుల సంఖ్యతో ఆ దేశం విలవిలలాడిపోతోంది. గడిచిన నాలుగు రోజులుగా ఫ్రాన్స్ 2 లక్షల కేసుల మార్కును దాటేస్తోంది. ఇప్పటివరకు కోటి కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా.. భారత్.. బ్రెజిల్.. బ్రిటన్.. రష్యా దేశాల సరసన ఫ్రాన్స్ చేరింది.

దీంతో.. స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్.. రాబోయే కొన్ని వారాలు చాలా కష్టతరంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా పెరుగుతున్నకేసుల నేపథ్యంలో ఆంక్షల్ని విధించే కన్నా.. ప్రజల స్వేచ్ఛకు పరిమితులు జారీ చేయాలన్న సూచనను ప్రభుత్వం చేయటం గమనార్హం. సోమవారం నుంచి ఆ దేశంలో బయటకు వచ్చే 6-11 ఏళ్ల పిల్లలతో సహా ప్రతి ఒక్కరు ముఖానికి మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 110కు పెరగ్గా.. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,23,851కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న కొవిడ్ మరణాల్లో ఫ్రాన్స్ 12వ స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు ఫ్రాన్స్ లాంటి దేశంలో కరోనా ఎంతటి విలయాన్ని క్రియేట్ చేశాయో ఇట్టే తెలుస్తుందని చెప్పక తప్పదు.