Begin typing your search above and press return to search.

గుంటూరులో కరోనా విజృంభణ .. ఎన్ని పాజిటివ్ కేసులు అంటే

By:  Tupaki Desk   |   13 April 2020 8:30 AM GMT
గుంటూరులో కరోనా విజృంభణ .. ఎన్ని పాజిటివ్  కేసులు అంటే
X
ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారంరాత్రి 10 గంటల నుంచి.. సోమవారం ఉదయం 10 గంటల వరకు నమోదైన కరోనా పరీక్షల్లో.. మరో 12 కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కుచేరగా కరోనా మరణాల సంఖ్య 7గా ఉంది. కరోనా వైరస్సం నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 12 మంది కోలుకున్నారు. దీనితో రాష్ట్ర ప్రజలలో ఆందోళన మొదలైంది.

ఇకపోతే ఏపీలోని గుంటూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 90కి చేరింది. దీనితో గుంటూరు జిల్లా వాసులు భయంతో వణికిపోతున్నారు. గుంటూరులో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ..గుంటూరు అంతటా కర్ఫ్యూ పాటిస్తున్నారు. రెడ్ జోన్లను పూర్తిగా అష్టదిగ్బంధనం చేయడంతో పాటు, జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా పోలీసులు లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వాళ్లు, వాళ్లతో కాంటాక్ట్ అయిన వాళ్ల సర్వే ఇప్పటికే పూర్తి అయ్యింది.

ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో చాలామంది శాంపిల్స్ ను ఇప్పటికే సేకరించారు. అలాగే మిగిలిన వారి శాంపిల్స్ ను కూడా సేకరిస్తున్నారు.దీనితో వచ్చే ఫలితాల్లో కూడా కచ్చితంగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి పెను ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని గ్రహించిన అధికారులు జిల్లాలో రెడ్ జోన్లను ప్రకటించి భద్రత కట్టుదిట్టం చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 10 గంటల వరకు చేసిన పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 12 కేసులు బయటపడ్డాయి. వీటిలో అత్యథికంగా గుంటూరు నుంచి 8 కేసులు నమోదైయ్యాయి. ప్రస్తుతం గుంటూరు లో 90, కర్నూలు లో 84, నెల్లూరు లో 52, ప్రకాశంలో 41 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలో కరోనా కొంచెం కంట్రోల్ లోనే ఉందని చెప్పవచ్చు.