Begin typing your search above and press return to search.

హుస్సేన్ సాగ‌ర్ లో క‌రోనా వైర‌స్‌..!

By:  Tupaki Desk   |   16 May 2021 5:30 PM GMT
హుస్సేన్ సాగ‌ర్ లో క‌రోనా వైర‌స్‌..!
X
క‌రోనా మ‌హ‌మ్మారి జ‌నాన్ని ఏ స్థాయిలో హ‌డ‌లెత్తిస్తోందో మాట‌ల్లో చెప్ప‌లేం. ఎవ‌రిని ముట్టుకుంటే సోకుతుందో.. ఏ వ‌స్తువును ప‌ట్టుకుంటే అంటుతుందో.. అని జ‌నాలు బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది.. ఏకంగా నీటిలోనే నిల్వ ఉంద‌నే వార్త ఇప్పుడు అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేసింది.

హైద‌రాబాద్ లోని హుస్సేన్ సాగ‌ర్ లో క‌రోనా జ‌న్యువుల ఆనవాళ్లు ఉన్న‌ట్టు ఓ అధ్య‌య‌నంలో తేలింద‌ట‌. కేవ‌లం సాగ‌ర్లోనే కాకుండా.. నాచారం పెద్ద చెరువు, తుర్క చెరువులోనూ ఈ ఆన‌వాళ్లు ఉన్నాయ‌ట‌. ఈ ప‌రిశోధ‌న‌ను ఐఐసీటీ, సీసీఎంబీ, ఏసీఐఆర్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్వ‌హించిన‌ట్టు స‌మాచారం.

ప‌లు జ‌లాయాశ‌యాల్లోని నీటిని సేకరించిన ఈ సంస్థ‌లు.. దాదాపు ఏడు నెల‌లుగా ఈ నీటిపై ప‌రిశోధ‌న‌లు సాగించార‌ట‌. అయితే.. ఈ నీటిలో కొవిడ్ వైర‌స్ జ‌న్యువులు ఉన్న‌ప్ప‌టికీ.. తీవ్రంగా విస్త‌రించ‌లేద‌ని తేల్చిన‌ట్టు తెలుస్తోంది. క‌రోనా బాధితుల మ‌ల‌విస‌ర్జ‌న వ‌ల్లే ఈ జ‌లాశ‌యాల్లోకి వైర‌స్ జ‌న్యుప‌దార్థాలు చేరాయ‌ని నిపుణులు తేల్చిన‌ట్టు స‌మాచారం.

అయితే.. ఈ నీటి నుంచి క‌రోనా వైర‌స్ మ‌నుషుల‌కు వ్యాపించే అవ‌కాశం లేద‌ని నిపుణులు నిర్ధారించిన‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అలా సోకిన‌ట్టు ఆధారాలు కూడా లేవ‌ని తేల్చార‌ట‌. అందువ‌ల్ల భ‌య‌ప‌డాల్సింది ఏమీ లేద‌ని చెప్పార‌ట‌. కాగా.. న‌గ‌ర శివారులోని పోతురాజ్ చెరువు, ఏదులాబాద్ చెరువుల్లో నీటిలో ఎలాంటి న‌మూనాలు ల‌భ్యం కాలేద‌ట‌.