Begin typing your search above and press return to search.
కొడుకు తెచ్చిన కరోనా తల్లి ప్రాణం తీసింది
By: Tupaki Desk | 14 March 2020 6:35 AM GMTభారత్ లో రెండో కరోనా మృతి చోటుచేసుకుంది. ఢిల్లీలో చికిత్స పొందుతూ 68 ఏళ్ల మహిళ మృతి చెందడం దేశంలో కలకలం రేపింది. కర్ణాటకలో 76ఏళ్ల వృద్ధుడు మొదటి కరోనా మృతుడు కాగా.. 68 ఏళ్ల మహిళ రెండో కరోనా మృతురాలుగా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.
అయితే వృద్ధురాలికి కరోనాకు ముందే బీపీ - షుగర్ ఉండడంతో రోగనిరోధక శక్తి కరోనాను తట్టుకోలేక మరణం సంభవించింది. కానీ ఈమెకు కరోనా వ్యాపించడానికి అసలు కారణం ఆమె కొడుకే అనే విషయం తెలిసింది. దీంతో అందరూ తల్లి ప్రాణం తీసిన కొడుకు అంటూ మీడియాలో బయటా ఆడిపోసుకుంటున్నారు.
ఈమె 46 ఏళ్ల కొడుకు ఇటీవల ఫిబ్రవరి 5 నుంచి 22 వరకు ఇటలీ - స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించి ఇండియాకు తిరిగివచ్చాడు. అప్పుడు అతనిలో కరోనా లక్షణాలు కనిపించలేదు. ఈనెల 7న దగ్గు - జ్వరంతో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరాడు.పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. విదేశాల్లోనే కరోనా సోకిందని తేలింది. దీంతో ఇతడితో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులకు టెస్ట్ చేయగా తల్లికి కూడా కరోనా సంక్రమించిందని తేలింది. ఆమెకు అంతకుముందే న్యూమోనియా ఉండడంతో కరోనాకు తీవ్ర ఎఫెక్ట్ అయ్యి 9న పరిస్థితి విషమించింది. ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. మూడు రోజులుగా కరోనా ధాటితో పాటు బీపీ - షుగర్ - న్యూమోనియాకు ఆ తల్లి పరిస్థితి విషమించి చనిపోయింది.
కొడుకు ద్వారా సంక్రమించిన కరోనా తో తల్లి మృత్యు వాతపడ్డ దైన్యం ఢిల్లీలో చోటుచేసుకుంది. కొడుకు ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నాడు. ఇతడితో కలిసి ఉన్న అందరికీ కేంద్రం వైద్యపరీక్షలు చేసి వారిని అబ్జర్వేషన్ లో ఉంచింది.