Begin typing your search above and press return to search.

కరోనా భయం.. దేశంలో ఇద్దరి ఆత్మహత్య

By:  Tupaki Desk   |   23 March 2020 11:10 AM GMT
కరోనా భయం.. దేశంలో ఇద్దరి ఆత్మహత్య
X
కరోనా వైరస్ భయంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన దేశంలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ బారిన పడినట్లు అనుమానించడంతో అవమానం భరించలేక.. బతుకు భయంతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూపీలోని హాపూర్ జిల్లా పికుహాలో ఒక వ్యక్తి, బరేలీ లో రెండో వ్యక్తి కరోనా భయంతో ఊపిరి తీసుకున్నాడు.

గత కొన్ని రోజులుగా సుశీల్ అనే వ్యక్తి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నాడు. తనకు కరోనా వైరస్ సోకిందని అతడు భయాందోళన చెందాడు. ఇతడు కరోనా వైరస్ టెస్ట్ చేయించుకున్నాడు. ఆ రిపోర్ట్ ఇంకా రాలేదు. ఇతడి కుటుంబం కూడా క్వారంటైన్ లో లేదు. తనకు కరోనా సోకిందని భయపడ్డ సుశీల్ బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ లో తన కుటుంబం కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించాడు. చని పోతున్నందుకు క్షమించాలని కోరాడు.

ఇక బరేలీకి చెందిన రెండో యువకుడికి కూడా లక్షణాలు ఉండడంతో అందరూ కరోనా సోకిందని ఈసడించుకున్నారు. మానసిక క్షోభ అనుభవించిన అతడు ఆత్మహత్య చేసుకోవడానికి డిసైడ్ అయ్యాడు. రైలు రాక కోసం రైల్వే స్టేషన్ కు వచ్చి కూర్చున్న అతడు రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ రెండు ఘటనలపై పోలీసులు స్పందించ లేదు. కరోనా పై విస్తృతంగా వ్యాపించిన వార్తలు, లక్షణాలు చూసుకొనే వీరిద్దరూ భయపడి సమాజం నుంచి వివక్ష ఎదురవుతుందని భావించి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

కరోనాతో చావు రాదని.. చికిత్స తీసుకుంటే బతుకగలమని దీనిపై ప్రభుత్వం అవగాహన కల్పించి ఇలా అపోహలతో చోటుచేసుకునే మరణాలు ఆపాలని పలువురు కోరుతున్నారు.