Begin typing your search above and press return to search.

భారత్‌ లో కరోనా తాండవం.. 733కు కేసులు

By:  Tupaki Desk   |   27 March 2020 8:30 AM
భారత్‌ లో కరోనా తాండవం.. 733కు కేసులు
X
ప్రపంచాన్ని గడగడలాడిన కరోనా వైరస్‌ భారతదేశంలోనూ అదే ఊపు కొనసాగిస్తోంది. తన పంజా విసురుతూ భారత్‌ను వణికిస్తోంది. త్వరలోనే ఆ కరోనా కేసులు వెయ్యి దాటే అవకాశం ఉంది. శుక్రవారం వరకు 733కు పైగా కేసులు నమోదవడంతో కరోనా వ్యాప్తి తీవ్రమవుతోందని తెలుస్తోంది. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవడంతో కొంత అదుపులోకి వచ్చినట్టు అనిపించినా రోజురోజుకు కేసులు పెరుగుతుండడం గమనార్హం. 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతుండగానే కేసులు మాత్రం తగ్గడం లేదు. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రస్తుతం భారతదేశంలో 733 కేసులు నమోదు కాగా 20మంది మృతిచెందడం భారత ప్రజలను భయాందోళనలో నెడుతోంది. మార్చి 27వ తేదీ వరకు ఈ పరిస్థితి ఉండగా 31వ తేదీలోపు వెయ్యి చేరుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

దేశవ్యాప్తoగా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు వంద దాటగా కర్నాటక, రాజస్థాన్‌, తెలంగాణలో యాభైకి చేరుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. కరోనా వైరస్‌ మృతులు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌ లలో ఒక్కొక్కరు చనిపోయారు. కర్నాటక, రాజస్థాన్‌ లలో ఇద్దరు చొప్పున మృతి చెందిన విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నా కరోనా కేసులు మాత్రం తక్కువ కావడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటివరకు కేసులు నమోదు కాని రాష్ట్రాల్లో కూడా వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆ రాష్ట్రాల్లో కూడా కరోనా అడుగుపెట్టే అవకాశం ఉంది. వెరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. పెరుగుదల రేటు మాత్రం నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కేరళలో 137, మహారాష్ట్రలో 125, కర్నాటక 55, రాజస్థాన్‌ 50, తెలంగాణ 45, ఉత్తరప్రదేశ్‌ 42, ఢిల్లీ 36, ఏపీ 12, పశ్చిమ బెంగాల్‌ 10, ఇతర రాష్ట్రాల్లో 15లోపు కేసులు నమోదయ్యాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న లెక్కలు మాత్రమే.