Begin typing your search above and press return to search.
భారత్ లో 1347కి కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే 230
By: Tupaki Desk | 31 March 2020 5:30 AM GMTభారత దేశంలోనూ కరోనా వైరస్ మూడో దశలోకి చేరుకుంది. రోగులకు ఇప్పటికే కరోనా సోకగా.. వారు అంటించిన వారికి ఇప్పుడు సోకుతోంది. కుటుంబ సభ్యులు.. బయట వారు కలిసిన వారికి కరోనా వ్యాపించడం మొదలైంది. దీంతో భారత్ లో కరోనా వ్యాధి శరవేగంగా విస్తరిస్తోంది. సామూహిక వ్యాప్తి దశకు కరోనా చేరిందని అర్థమవుతోంది. ఇదే అత్యంత డేంజర్ దశ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా 200కుపైగా కొత్త కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. దాదాపు 11 మంది మృతిచెందారు.
అయితే దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశకు రాలేదని.. ఇంకా సంక్రమణ దశలోనే ఉందని స్పష్టం చేశారు. సోమవారం దేశంలో కొత్తగా 227మందిలో కరోనా నిర్ధారణ అయిందని తెలిపింది. మంగళవారానికి ఆ సంఖ్య 230కి దాటింది.
* తెలంగాణలో కొత్తగా ఆరుగురికి కరోనా..
తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య 77కు చేరింది. కరోనా కేసుల్లో 3 ఏళ్ల బాలిక సహా కరీంనగర్ కు చెందిన తల్లి, కుమార్తెకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. కరీంనగర్ లో ఇండోనేషియన్లతో తిరిగిన యువకుడి కుటుంబం ఇదీ. అతడితోపాటు కుటుంబానికి సోకింది. ఇక 13 మందిని కరోనా చికిత్స నుంచి కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు.
*ఏపీలో కరోనా కేసుల సంఖ్య 23కు
ఏపీలోనూ కరోనా నెమ్మదిగా విస్తరిస్తోంది. విజయవాడకు చెందిన భార్యభర్తల్లో భార్య ఆదివారం, భర్త సోమవారం మరణించారు. వారి కుమారుడు ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమం లో పాల్గొని వచ్చాడు. అతడి తల్లిదండ్రులకు కరోనా సోకగా వారు మరణించారు.
*ఢిల్లీ గుబులు
ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొన్న వారికి కరోనా సోకుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది హాజరయ్యారు. దీంతో ఇప్పుడు వారందరిలోనూ భయం నెలకొంది.