Begin typing your search above and press return to search.
కరోనా కేసులతో చైనా కన్నా భారత్ కే తీవ్ర నష్టం
By: Tupaki Desk | 15 April 2020 3:30 AM GMTవాస్తవంగా కరో్నా వైరస్ వెలుగులోకి వచ్చినది చైనా గడ్డపై. ఆ దేశంలో వైరస్ తీవ్రంగా వ్యాపించి భారీ నష్టం చేకూర్చింది. అయితే ఆ నష్టం చైనాతో పోలిస్తే ఇప్పటికే భారతదేశంలో అధికంగా ఉంది. ఈ వైరస్ దెబ్బకు భారత స్టాక్ మార్కెటంతా కుదేలవుతోంది. వారం రోజుల ట్రేడింగ్ చూస్తే నష్టాల్లోనే ఉంది. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల బారిన పడ్డాయి. చమురు ధరలు పెరగడంతో విమానయాన - చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు మిశ్రమంగా ముగిశాయి.
ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌తో భారతకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే రూ.8 లక్షల కోట్ల నష్టం సంభవించింది. ఈ నష్టం అన్ని రంగాల్లోనూ ఉంది. స్టాక్ మార్కెట్ లో బ్యాంకింగ్ రంగ షేర్లు దాదాపు 4 శాతం మేర నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంకు 3.44 శాతం - హెచ్ డీఎఫ్‌సీ బ్యాంకు 3.12 శాతం - హెచ్ డీఎఫ్ సీ 2.79 శాతం నష్టపోయాయి. ఈ ఏడాదిలో నిఫ్టీ బ్యాంకింగ్ దాదాపు 40 శాతం మేర నష్టపోయింది. రియల్, పైనాన్స్, ఆటో - ఫైనాన్స్ - ఎఫ్ ఎంసీజీ రంగాలు కూడా దాదాపు 4 శాతం నుంచి 5 శాతం మేర నష్టపోయాయని ట్రేడింగ్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో కేవలం టెలికం - మెటల్ షేర్లు మాత్రమే రాణించడం విశేషం.
కరోనా కేసులు - మృతుల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇన్వెస్టర్ సెంటిమెంట్ మాత్రం మిగతా దేశాలతో పోలిస్తే ఏమాత్రం బలంగా లేదని పరిణామాలు చూస్తుంటే తెలుస్తోంది. కరోనా తీవ్రంగా ఉన్న దేశాల్లో స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ఉండగా భారత్ లో మాత్రం పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 9 మధ్య భారత స్టాక్ మార్కెట్ డాలర్ మారకంలో 26 శాతం నష్టపోయింది. అమెరికా - యూరోప్ మార్కెట్లు వరుసగా 14 శాతం - 20 శాతం నష్టపోయాయి. వర్ధమాన మార్కెట్లు 15 శాతం క్షీణించాయని ట్రేడింగ్ లెక్కలు చూస్తుంటే తెలుస్తోంది.
చైనాలో కేవలం 3 శాతమే కరోనా ఉద్భవించిన చైనాలో మార్కెట్ ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 9వ తేదీ మధ్య 3 శాతం నష్టపోయింది. ప్రపంచ దేశాల మార్కెట్లు ఈ మధ్య కాలంలో నష్టపోయింది 3 శాతం నుంచి 15 లేదా 20 శాతం మధ్య ఉంది. కానీ భారత మార్కెట్ మాత్రం 25 శాతానికి పైగా నష్టపోయింది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ తో అత్యంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందిన చైనా మార్కెట్ పరంగా అతి తక్కువ దెబ్బతిన్నది. లాక్‌డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడింది. మూడు వారాల లాక్ డౌన్ తో భారత ఆర్థిక వ్యవస్థ పై రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల ప్రభావం పడింది. ప్రస్తుతం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించడంతో మరింత ప్రభావం మార్కెట్‌పై చూపే అవకాశం ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఇప్పట్లో లాభాలు పొందడం కష్టమేనని ఆర్థిక విశ్లేషకులు, స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.