Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ సక్సెస్ మాట్లాడుతున్నారే కానీ వైఫల్యాల్ని లైట్ తీసుకుంటున్నారా?
By: Tupaki Desk | 15 April 2020 4:15 AM GMTకరోనా ఎపిసోడ్ లో కొమ్ములు తిరిగి దేశాలతో పోలిస్తే.. భారత్ భేషుగ్గా పని చేస్తుందన్న ప్రశంసలు తరచూ వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఇందులో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. కరోనాకు సంబంధించిన కీలక సమాచారాన్ని పంచుకునే విషయంలో భారత్ చేసే ఆలస్యం అంతా ఇంతా కాదన్న మాట వినిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ తయారీపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కోవిడ్ 19 జన్యు క్రమం ఎలా ఉందన్న విషయాన్ని ఏ దేశానికి ఆ దేశం తయారు చేస్తోంది. ఈ విషయంలో భారత్ తీసుకున్న సమయం చాలా ఎక్కువగా అభివర్ణిస్తున్నారు. దేశంలో నమోదైన తొలి కరోనా కేసు కేరళలో అన్నది తెలిసిందే. బాధితుడి రక్తాన్ని శాంపిల్ గా తీసుకున్న అధికారులు.. అందులో కోవిడ్ 19 జన్యుక్రమాన్ని రూపొందించే విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
దీంతో.. వ్యాక్సిన తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా ఆస్ట్రేలియా.. తైవాన్ సైంటిస్టులు ఆరోపిస్తున్నారు. మిగిలిన దేశాల్లోని కోవిడ్ 19తో పోలిస్తే కేరళలో బయటపడిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులోని జన్యు క్రమం తేడా ఉన్నట్లు గుర్తించారు. కడ్డీల ఆకారంలోని స్పైక్ ప్రోీన్లలో చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు. వైరస్ వ్యాప్తిలో తనను తాను మార్చుకుంటున్న తీరును పరిగణలోకి తీసుకోకుండా వ్యాక్సిన్లు తయారు చేస్తే.. ఎలాంటి ప్రయోజనం ఉండదన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంతోనే జన్యుపటాన్ని వేగంగా తయారు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆ విషయంలో జరిగే ఆలస్యం.. వ్యాక్సిన్ రూపొందించటం మీద పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ మంచి నిర్ణయమే అయినా.. జన్యు పటాన్ని రూపొందించేందుకు మాత్రం రెండు నెలల సమయం చాలా ఎక్కువన్న విమర్శను పలువురు చేస్తున్నారు.