Begin typing your search above and press return to search.
చచ్చినా కష్టాలేనా.. కరోనా బాధితుల అంత్యక్రియలకు అడ్డంకులు
By: Tupaki Desk | 27 April 2020 5:20 AM GMTభారతదేశం తో పాటు ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో అతలాకుతలమవుతున్నాయి. కరోనా లక్షణాలు ప్రజలు వెంటనే భయపడుతూ వారి నుంచి దూరంగా వెళ్తున్నారు. అలాంటిది ఇక కరోనా సోకిన వ్యక్తులను సమాజం మనుషులు గా గుర్తించడం లేదు. ఈ క్రమంలో కరోనా బారిన పడి చచ్చిన వారిని కూడా మానవత్వం మరచి వారి అంత్యక్రియలకు సహకరించడం లేదు. ఈ సందర్భంలో కరోనా మృత దేహాల ఖననం, దహనానికి చాలాచోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో చచ్చిన తర్వాత కూడా కష్టాలు కొనసాగడం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వైద్యులను కూడా అదే బాటన కట్టేస్తూ వారి అంత్యక్రియలకు అడ్డు చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకి చెందిన ఓ డాక్టర్ కరోనా వైరస్ తో పోరాడుతూ తమిళనాడులోని చెన్నై ఆస్పత్రిలో మరణించాడు. అయితే అతడి దహన సంస్కారాలకు స్థానికుల తీవ్రంగా నిరసించారు. చేయొద్దని ఆందోళన చేయడంతో బందోబస్తు హడావుడిగా అంతిమ సంస్కారం నిర్వహించారు. మేఘాలయలో ఓ వైద్యుడు కరోనా బారిన పడి మృతిచెందగా బంధువులు ఎవరూ పట్టించుకోకపోవడం, స్థానికంగా అతడి అంత్యక్రియలకు ఎవరూ సహకరించలేదు. దీంతో అతడికి మున్సిపాల్టీ కార్మికులు చివరి కార్యక్రమం పూర్తి చేశారు.
పంజాబ్ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కరోనా వైరస్‌తో మృతి చెందితే ఆయనకు కూడా ఇలాంటి గతే పట్టింది. మృతదేహాన్ని దహనం చేయడానికి ఆయన సొంత గ్రామస్తులే అంగీకరించలేదు. దహనం చేస్తే పొగ వలన వైరస్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతూ అంతిమ సంస్కారాన్ని అడ్డుకున్నారు. ఇక పంజాబ్‌లో కపుర్తాలాకు చెందిన ఒక మహిళ కుమారుడు పట్టించుకోలేదు. తల్లిని కడసారి చూసేందుకు కూడా రాలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మున్సిపాల్టీ సిబ్బంది సొంత బంధువులుగా ఆమె తుది ప్రక్రియ పూర్తి చేశారు.
ఈ విధంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 775 మంది మృతి చెందారు. వీటిలో పెద్ద సంఖ్యలో పై పరిస్థితే ఎదురైంది. కరోనాతో మృతి చెందిన వారి శవాలను కూడా వారి కుటుంబ సభ్యులు, బంధువులు చూడడానికి సాహసించడం లేదు. వారి అంతిమ సంస్కారాలన్నీ దిక్కులేని వారిగా ప్రభుత్వమే చేపిస్తోంది. అయితే ఈ అంత్యక్రియలపై భారతదేశం స్పష్టమైన నిబంధనలు, ఆదేశాలు జారీ చేసినా స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుండడంతో ఇక విధిలేక ప్రభుత్వ యంత్రాంగం అంత్యక్రియలు జరిపిస్తోంది. ఒకప్పుడు అనాథ శవాలను మున్సిపల్ సిబ్బంది దహనం చేసేది. ఇప్పుడు యి. పటిష్టమైన బందోబస్తు మధ్య వారికి అంతిమ సంస్కారం నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
అయితే వాస్తవం ప్రజలకు తెలియడం లేదు. అవగాహన లేమితో కరోనా మృతుల అంత్యక్రియలను అడ్డుకుంటున్నారు. వాస్తవంగా కరోనా వైరస్‌తో మరణించినప్పటికీ మృతదేహం నుంచి ఎలాంటి వైరస్ ఇతరులకు సోకదని ప్రభుత్వ అధికారులు, వైద్యులు చెబుతున్నారు. ఇకపై అలాంటి పరిణామాలు జరగకుండా శాస్త్రోక్తంగా కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు జరిగేలా సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.