Begin typing your search above and press return to search.
దేశంలో మూడు రకాల వైరస్ లు ముప్పేట దాడి !
By: Tupaki Desk | 28 April 2020 2:30 AM GMTకరోనా మహమ్మారి మూడు రూపాల్లో విరుచుకుపడుతూ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ఒక్కోచోట ఒక్కోలా వ్యాపిస్తూ మానవాళిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో కాస్త తక్కువగా ఉంది. కొన్నిచోట్ల వైరస్ తో చనిపోయే వారి శాతం అధికంగా ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కరోనా బారినపడిన వారు వేగంగా కోలుకుంటుంటే, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఆలస్యంగా కోలుకుంటున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసుల్లో మరణాల రేటు 4.23 శాతంగా ఉంది. అక్కడ అత్యధికంగా 7,628 కేసులు నమోదయ్యాయి. కేరళలో మరణాల రేటు 0.88 శాతమే. తెలంగాణలో 2.62%గా ఉంది. మేఘాలయలో తక్కువ కేసులున్నా మరణాల రేటు దేశంలోనే అత్యధికంగా 8.33 శాతం ఉంది. ఆ తర్వాత పంజాబ్ లో 5.70 శాతం ఉంది.
ఈ మహమ్మారి ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికాలో వేలాది మందిని బలితీసుకుంది. కొన్ని దేశాల్లో కొన్ని రకాలుగా, మరికొన్ని దేశాల్లో ఇంకో విధంగా కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు 1,563 శాంపిళ్ల నుంచి కరోనా వైరస్ జీనోమ్ లను రూపొందించారు. వాటి ఆధారంగా మన దేశంలో 21 శాంపిళ్ల నుంచి వైరస్ జీనోమ్‌లను తయారు చేశారు. వాస్తవంగా మన దేశంలో 303 కేసులను 41కు కుదించి, వాటి నుండి 21 శాంపిళ్ల జన్యు నమూనాలు రూపొందించారు. అందులో వూహాన్ కు చెందినవి రెండు ఉండగా, ఇటలీ, ఇరాన్ దేశాలకు చెందినవి 19 ఉన్నాయి. ఈ 21 శాంపిళ్లలో కామన్ లక్షణాలను గుర్తించారు. వాటి మధ్య సారూప్యత 99.97 శాతంగా ఉంది.
పరిశోధన లో భాగంగా 21 శాంపిళ్లను శాస్త్రవేత్తలు ఐదుగా విభజించారు.
– ఉహాన్ నుంచి వచ్చిన భారతీయులు.. వీరిలో కేరళకు చెందిన వారున్నారు.
– ఇరాన్‌లో ఉండే భారతీయులు.. వీరి శాంపిళ్లను సేకరించారు.
– ఇటలీ వెళ్లొచ్చిన భారతీయులు. వీరు ఇటలీ వాళ్లను కలవడం వల్ల వచ్చిన పాజిటివ్ కేసులు.
– ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చిన పర్యాటకులు. వారు రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో తిరిగారు.
– ఆగ్రాలో నమోదైన కేసులు. వీరు ఇటలీ వెళ్లొచ్చారు. వారి కుటుంబ సభ్యుల శాంపిళ్లను సేకరించారు.
ఐదు రకాలను ‘ఇటలీ, వూహాన్ , ఇరాన్’ అనే మూడు గ్రూపులుగా విభజించారు. ఈ మూడు దేశాలకు చెందిన 21 జీనోమ్‌లకు కోడ్ కేటాయించారు. వూహాన్‌కు ‘వీ’, ఇటలీకి ‘జీ’, ఇరాన్‌కు ‘ఎస్’అనే కోడ్ ఇచ్చారు. ఇక జీ (ఇటలీ) గ్రూపులోనూ రెండు ఉప గ్రూపులను గుర్తించారు. వాటిలో ఒక గ్రూపు.. భారతదేశానికి వచ్చిన ఇటాలియన్ టూరిస్టులు. వీరిలో వూహాన్ వైరస్ ఉండటంతో పాటు స్కాట్లాండ్, ఫిన్లాండ్, ఇంగ్లండ్‌కు దగ్గరగా వీళ్ల జీనోమ్ లు ఉన్నట్లు గుర్తించారు. మరో ఉప గ్రూపు.. ఆగ్రాతో కాంటాక్ట్ అయినవారు. వీరి జీనోమ్ ను పరిశీలించగా బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ జీనోమ్ లకు దగ్గరగా ఉన్నాయి. ఇటలీ, వూహాన్ జీనోమ్ ల్లో దగ్గరి పోలికలు ఉన్నాయి. వాటి మధ్య తేడా 0.01 శాతంగా ఉంది. ఇరాన్ జీనోమ్ కు, వూహాన్ కు 0.024 శాతం తేడా ఉంది. ఈ తేడా ఎక్కువ ఉండటం వల్ల ఇరాన్ జీనోమ్ వల్ల వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచం మొత్తమ్మీద ఎక్కువ దేశాల్లోని కేసులు ఇటలీ జీనోమ్ కు దగ్గరగా ఉన్నాయి. ప్రపంచంలో 30 రకాల కోవిడ్–19 వైరస్‌లున్నాయి. అందులో మన దేశంలో మూడు రకాలున్నాయి. అయితే వాటి మధ్య కొద్దిపాటి తేడాలున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా వైరస్ వ్యాప్తి, మరణాలు, రికవరీ రేట్లు ఉన్నాయి.
కరోనా వైరస్ ఒక్కోచోట ఒక్కోవిధంగా వ్యాపించడానికి గల కారణాలను భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధించారు. ప్రపంచ వ్యాప్తంగా 30 రకాల విభిన్న లక్షణాలున్న కరోనా వైరస్ లుంటే, భారతదేశంలో మూడు రకాల వైరస్‌లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఒక వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుందని గుర్తించారు. అందుకు సంబంధించి ఎన్ ఐవీ, ఐసీఎంఆర్, ఎయిమ్స్ లు ఇటీవల కరోనా వైరస్ పై సంయుక్తంగా పరిశోధన నిర్వహించాయి. పరిశోధన వివరాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి రెండ్రోజుల క్రితం వెల్లడించింది.