Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ తర్వాత సీన్ ఉండేది ఇలానేనా?
By: Tupaki Desk | 29 April 2020 12:30 AM GMTభారత్ లాంటి దేశం మొత్తం ఒక్కసారిగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోతుందన్నది కలలో కూడా ఊహించలేదు. కరోనా పుణ్యమా అని అలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఒకసారి కాదు రెండోసారి సైతం లాక్ డౌన్ పొడిగించక తప్పలేదు. కేంద్రం చెప్పిన దాని ప్రకారం లాక్ డౌన్ మే 3తో ముగుస్తుంది. అయితే..మూడోసారి కూడా లాక్ డౌన్ కొనసాగిస్తారా? లేదంటే.. ఎత్తివేస్తారా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు ఉంటే.. తెలంగాణలో మాత్రం మే ఏడు వరకు సాగుతుందన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం మే మూడుతో లాక్ డౌన్ ను కేంద్రం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. అయితే.. కేంద్రం చెప్పినట్లుగా కొన్ని రాష్ట్రాలు పాటిస్తే.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఓకే చెప్పవన్న మాట వినిపిస్తోంది.
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సీన్ ఎలా ఉంటుంది? గతంలో మాదిరి బస్సులు.. రైళ్లు.. విమానాలు పని చేయటం మొదలు పెడతాయా? అంటే నో అనే చెబుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్ని రెడ్ జోన్ గా.. మిగిలిన జోన్లను వేరు చేసి.. ఒక్కోచోట ఒక్కోలా నిబంధనల్ని సడలిస్తారని చెబుతున్నారు. లాక్ డౌన్ ఎత్తి వేసిన వెంటనే విమానాలు.. రైళ్లు.. బస్సులు.. ఇలా ప్రజారవాణా ఏదీ అందుబాటులోకి రావంటున్నారు. అంతేకాదు.. స్కూళ్లు.. కాలేజీలు.. సినిమాహాళ్లు.. షాపింగ్ మాల్స్.. ప్రార్థనామందిరాలు ఏమీ కూడా ఓపెన్ కావంటున్నారు.
కాకుంటే.. ప్రజలు తామున్న చోటు నుంచి వేరే చోటుకు వెళ్లేందుకు వీలుగా పరిమితంగా అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని.. అందుకు తమ వ్యక్తిగత వాహనాల్ని ఉపయోగించేందుకు ఓకే చెప్పే అవకాశం ఉందంటున్నారు. వాహనాల్లోనూ సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత కూడా నిబంధనలు అంతో ఇంతో అమలవుతుంటాయే తప్పించి.. సీన్ మొత్తం పూర్తిగా మారిపోయే ఛాన్సు ఉండదని చెబుతున్నారు.