Begin typing your search above and press return to search.
డిపెండ్ అయ్యేది లేదు.. సొంతంగా తయారీ అంటూ కీలక ప్రకటన
By: Tupaki Desk | 29 April 2020 4:15 AM GMTకరోనా నిర్దారణ పరీక్షలకు సంబంధించిన కిట్లను విదేశాల నుంచి తెప్పిస్తున్న వైనం తెలిసిందే. ఇటీవల చైనా నుంచి తెప్పించిన కిట్ల నాణ్యత సరిగా లేకపోవటంతో.. వాటిని ఉపయోగించొద్దంటూ కేంద్రం తేల్చి చెప్పిన వైనం తెలిసిందే. కరోనా కిట్ల అవసరం అంతకంతకూ పెరిగిపోవటం.. రానున్న రోజుల్లో వీటి డిమాండ్ మరింత పెరిగే వీలున్న నేపథ్యంలో.. సొంతంగా తయారు చేయటం మీద ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మరో నెల వ్యవధిలో ఆర్ టీ-పీసీఆర్.. యాంటీ బాడీ టెస్ట్ కిట్లను సొంతంగా తయారు చేయనున్న విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. కిట్ల తయారీకి సంబంధించిన అన్ని పనులు చివరిదశకు వచ్చేసినట్లుగా ఆయన చెబుతున్నారు. ఐసీఎంఆర్ నుంచి ఆమోదం లభించటమే మిగిలి ఉందని చెప్పారు.
ఐసీఎంఆర్ ఒకసారి ఓకే చెప్పినంతనే కిట్ల తయారీ స్టార్ట్ చేయనున్నారు. కిట్లను సొంతంగా తయారు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవటం వెనుక అసలు కారణం వేరే ఉంది. రానున్న రోజుల్లో రోజకు లక్ష నిర్దారణ పరీక్షలు చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అదే జరిగితే.. భారీ ఎత్తున కిట్ల అవసరం ఏర్పడుతుంది. విదేశాల నుంచి తెప్పించిన కిట్ల నాణ్యత మీద సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. వాళ్ల మీదా.. మీళ్ల మీదా ఆధారపడటం ఎందుకు? సొంతంగా తయారు చేసుకుంటే పోలా? అన్న నిర్ణయానికి వచ్చారు.
దీని ఫలితంగానే కిట్ల తయారీపై ఫోకస్ పెంచింది కేంద్రం. ఇదిలా ఉంటే.. చైనా నుంచి తెప్పించిన కిట్లపై బ్యాన్ విధించిన కేంద్రం మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ కిట్లపై బ్యాన్ విధించిన నేపథ్యంలో ఒక్క రూపాయి కూడా నష్టపోయే అవకాశం లేదని చెప్పింది. ప్రతిపక్షాలకు మాట వరసకు అవకాశం ఇవ్వకుండా.. ఎదుటోళ్లు అడగకుండానే విషయాల్ని చెప్పేస్తున్న వైనం చూస్తే.. మోడీ పరివారం ఎంతో అప్రమత్తంగా ఉందని చెప్పొచ్చు.