Begin typing your search above and press return to search.

9 రాష్ట్రాలు 15 జిల్లాలు..ఇలా చేస్తే కరోనా పై విజయం తథ్యం!

By:  Tupaki Desk   |   29 April 2020 10:50 AM GMT
9 రాష్ట్రాలు 15 జిల్లాలు..ఇలా చేస్తే  కరోనా పై విజయం తథ్యం!
X
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజూ కొత్త కేసులు బయపడుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 30వేలకు చేరింది. అలాగే, మరణాల సంఖ్య వెయ్యి దాటిపోయింది. లాక్ డౌన్ అమలులో ఉఅన్నప్పటికీ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మందు లేకపోవడంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది.

మన దేశంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధిక కేసులు కేవలం 9 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అందులోనూ 15 జిల్లాల్లోనే తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్, ఏపీ నుంచి కర్నూలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో కరోనాను అరికడితే దేశంలో ఈ మహమ్మారి నియంత్రణలోకి వచ్చినట్లే. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మంగళవారం (ఏప్రిల్ 28,2020) వెల్లడించారు. దేశంలో వచ్చిన పాజిటివ్ కేసుల్లో 87.13% వరకు కేసులు 15 జిల్లాల నుంచే వచ్చాయనీ, అక్కడ కట్టడి చర్యలు, పరీక్షలు, చికిత్సలపై పర్యవేక్షణ మరింత పెంచాలని అయన అభిప్రాయ పడ్డారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత 5 రోజులుగా అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1009 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. 5 రోజులుగా పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.

సరాసరిగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. పరీక్షలు ఎక్కువ చేయడంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు ఏపీలో 1332 కేసులు నమోదయ్యాయి. రెండు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువశాతం హైదరాబాద్, కర్నూలు జిల్లాల నుంచే ఉంటున్నాయి. ఈ జిల్లాలతో పాటుగా ..దేశంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్న జిల్లాల్లో కరోనా ను కంట్రోల్ చేయగలిగితే ..దేశంలో కరోనాను కట్టడి చేసినట్టే అని అధికారులు భావిస్తున్నారు.

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 9 రాష్ట్రాల్లోని 15 జిల్లాలు ఏవంటే ..

* ఢిల్లీ రాష్ట్రంలో ఢిల్లీ జిల్లా
* మహారాష్ట్ర రాష్ట్రంలో ముంబై జిల్లా - పూణే జిల్లా - ఠాణే జిల్లా
* గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ జిల్లా - సూరత్ జిల్లా - వడోదరా జిల్లా
* మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ జిల్లా - భోపాల్ జిల్లా
* రాజస్తాన్ రాష్ట్రంలో జైపూర్ జిల్లా - జోధ్ పూర్ జిల్లా
* తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా
* ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా జిల్లా
* తమిళనాడు రాష్ట్రంలో చెన్నై జిల్లా