Begin typing your search above and press return to search.

వలసల పై కేంద్ర హోం శాఖ జారీ చేసిన తాజా ఆదేశమిదే..

By:  Tupaki Desk   |   4 May 2020 4:30 AM GMT
వలసల పై కేంద్ర హోం శాఖ జారీ చేసిన తాజా ఆదేశమిదే..
X
లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. సొంతూళ్లకు వెళ్లేందుకు ఓకే చెప్పిన కేంద్రం.. వలస కూలీలు.. కార్మికులతో పాటు.. యాత్రికులు.. విద్యార్థులకు సైతం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయానికి సంబంధించి కీలక ఉత్తర్వును జారీ చేసింది.

ఏప్రిల్ ముప్ఫైతో పాటు.. మే ఒకటిన జారీ చేసిన ఆదేశాలపై కేంద్రం స్పష్టతను ఇస్తూ.. అన్ని రాష్ట్రాల సీఎస్ లు.. కేంద్ర ప్రాలిత ప్రాంతాల ఆడ్మినిస్ట్రేటర్లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. రాష్ట్రాలకు వచ్చే తమ వారిలో ఎవరిని అనుమతించాలన్న దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

లాక్ డౌన్ కు కొద్దిరోజుల ముందు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చిక్కుకుపోయిన వారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించాలని కోరారు. అంతే తప్పించి.. వేరే రాష్ట్రాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తరలించొద్దని కోరారు. వలస కూలీలు.. కార్మికులతో పాటు.. ఇతరులు ఎవరైనా సరే.. వేరే రాష్ట్రంలో నివాస సౌకర్యంతో పాటు.. ఉపాధికి ఉండి ఉంటే.. వారిని అక్కడే ఉంచేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించింది.

ఎందుకంటే.. లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా నిర్మాణ రంగానికి అనుమతులు ఇచ్చేసిన కేంద్రం.. వలస కూలీలు.. కార్మికులు.. ఇతర ఉపాధి కోసం రాష్ట్రాల్లో ఉన్న వారు సొంతూళ్లకు బయలుదేరితో.. పని వారి కొరత తీవ్రంగా వేధించటమే కాదు.. కొత్త ఇబ్బందుల్ని తీసుకొస్తుందని భావిస్తున్నారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల్ని ఆయా రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో చూడాలి.