Begin typing your search above and press return to search.
కరోనా: భారత్ లో 50వేలు, ఏపీలో 1717, తెలంగాణలో 1096
By: Tupaki Desk | 6 May 2020 6:15 AM GMTభారత దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తూనే ఉంది. గత మూడు రోజులుగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2958 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 126 మరణాలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా రోగుల సంఖ్య బుధవారం ఉదయానికి 49391కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో 1694మంది మరణించారని కేంద్ర ఆరోగ్య,కుటుంబ శాఖ అధికారికంగా వెల్లడించింది. 14813మంది కోలుకున్నారని.. ప్రస్తుతం 33514మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ భారీగా ఉంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 984 కొత్త కేసులు.. 34మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 15525కి చేరింది. 617మంది చనిపోయారు.
గుజరాత్ లో 6245 కేసులు.. 368మంది మరణించారు. ఢిల్లీలో 5104 కేసులు.. 64మంది మరణాలు.. తమిళనాడులో 4058 కేసులు.. 33మంది మరణించారు.
*ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏపీలో నిన్న ఒక్కరోజే 67 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1717కి చేరింది. ఏపీ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 34మంది చనిపోయారు. ఏపీలో కరోనా నుంచి 589మంది కోలుకున్నారు.
*తెలంగాణలో తగ్గుతున్న కేసులు
తెలంగాణ కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 11 కేసులు నిర్ధారణ అయ్యింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1096కి చేరింది. 29మంది కరోనాతో తెలంగాణలో చనిపోయారు.
*ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,726,797 మందికి చేరింది. వీరిలో 258, 306 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12.42 లక్షల మంది కోలుకోగా.. 21 లక్షల మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో 49 వేల మంది పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్‌లలో ప్రాణనష్టం భారీగా ఉంది. ఇప్పటి వరకూ ఐరోపాలోని ఇటలీలో అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకోగా.. ఆ సంఖ్యను బ్రిటన్ అధిగమించింది. అక్కడ మొత్తం కరోనా మరణాలు 29,427కి చేరాయి.
అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 12.32 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా.. దాదాపు 72వేల మందికి పైగా మరణించారు. అమెరికాలో మొత్తం కరోనా వైరస్ కేసులు మరియు మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. చాలా రాష్ట్రాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.. అమెరికాలోనే 134,000 మంది వైరస్ తో మరణిస్తారని అమెరికాలోని ఒక అధ్యయనం అంచనా వేస్తుండగా, అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ ఇది దాదాపు 100,000 మరణాలు కావచ్చని తెలిపారు.